Srileela, Mrinal Thakur : శ్రీలీలను మించిపోయిన మృణాల్ ఠాకూర్..అంతా డిమాండ్ చేస్తుందా?

యంగ్ హీరోయిన్ శ్రీలీల( Srileela ) బ్యూటిఫుల్ లుక్స్, ముచ్చటైన హావభావాలు, బీభత్సమైన గ్లామర్ షోతో ఫస్ట్ సినిమాతో హిట్ అందుకుంది.ఈ కన్నడ భామ 2021లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

 Mrunal Demands Huge Remuneration-TeluguStop.com

మొదటి సినిమాలోనే ఇంటెన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించి ఈ ముద్దుగుమ్మ కుర్రకారుకు బాగా దగ్గర అయింది.తర్వాత ధమాకా( Dhamaka ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఈ మూవీలో రవితేజతో కలిసి శ్రీ లీల రొమాన్స్ చేసింది.అదిరిపోయే డ్యాన్స్‌లతోపాటు చక్కటి యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసులు దోచేసింది.

అల్లరి పిల్లగా, ఎనర్జిటిక్ హీరోయిన్‌గా ఇప్పుడు దర్శక నిర్మాత దృష్టిని ఆకట్టుకుంటోంది.

ధమాకా సినిమాతో ఈ ముద్దుగుమ్మకు ఫుల్ క్రేజ్ వచ్చింది.

దాంతో ఒకేసారి అమ్మడికి 8 సినిమా అవకాశాలు వచ్చాయి.అందులో ఆది కేశవ, స్కంద, భగవంత్‌ కేసరి, నితిన్ 32, జూనియర్, గుంటూరు కారం, వీడీ12, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి.

ఈ బ్యూటీ గుంటూరు కారం( Guntur karam ) సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తోంది.పవన్ కళ్యాణ్ సరసన కూడా ఈ ముద్దుగుమ్మ నటించే ఛాన్స్ పట్టేసింది.

ఒకేసారి ఇన్ని అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్‌గా శ్రీలీల అవతరించింది.

Telugu Dhamaka, Guntur Karam, Mrunal Thakur, Srileela, Tollywood-Telugu Stop Exc

ఇప్పుడు టాలీవుడ్( Tollywood ) మేకర్స్ కొంతమంది హీరోయిన్లను మాత్రమే తమ అప్‌కమింగ్ సినిమాలకు పరిశీలిస్తున్నారు.వారిలో సీతా రామం హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్( Mrinal Thakur ), శ్రీ లీల ముందు వరుసలో ఉన్నారు.దర్శకనిర్మాతలు ప్రస్తుతం మృణాల్‌ తర్వాత శ్రీ లీలనే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

కాగా ఇప్పుడు మృణాల్‌ మూడు హిందీ సినిమాలతో సూపర్ బిజీగా ఉంది.తెలుగులో నాని 30 సినిమా చేస్తోంది.

అలా చూసుకుంటే శ్రీ లీలనే ఎక్కువ అవకాశాలను కలిగి ఉంది.అంటే ఆమెకే చాలా డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

Telugu Dhamaka, Guntur Karam, Mrunal Thakur, Srileela, Tollywood-Telugu Stop Exc

డిమాండ్ చూపి శ్రీలీల చాలా రెమ్యునరేషన్ ( Remuneration )అడుగుతోంది.ప్రస్తుతం సినిమా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం,  ముద్దుగుమ్మ మృణల్ ఒక్కో సినిమాకి 6 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.అయితే ఇది చాలా ఎక్కువ అని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారని సమాచారం.ప్రస్తుతానికైతే ఒప్పుకున్న సినిమాలకు శ్రిలీల మూడు కోట్లు నిర్మాతల నుంచి వసూలు చేస్తోంది.అయితే కొత్తగా ఏవైనా సినిమా అవకాశాలు వచ్చినప్పుడు మ్రుణాల్ ఆరు కోట్లు ఇవ్వాలనే తన డిమాండ్ ని వినిపిస్తోంది.దాంతో నిర్మాతలు షాక్ అయి వెనుదిరుగుతున్నారని సమాచారం.

ఈ అమౌంట్ శ్రిలీల అడుగుతున్న దానికంటే ఎక్కువే.ఆరు కోట్లు అడిగేంత క్రేజ్‌, డిమాండ్ ఆమెకు లేదని ట్రేడ్ పండితులు కూడా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube