టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు గతంలో హిందీ వైపు చూడలేదు.ఒకరు ఇద్దరు హిందీలో నటించే ప్రయత్నం చేశారు కానీ ఆకట్టుకోలేక పోయారు.
తాజాగా టాలీవుడ్( Tollywood ) కు చెందిన స్టార్ హీరోలు చాలా మంది హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.తాము నటించిన సినిమాలను హిందీలో విడుదల చేస్తున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ ( Adipurush ) సినిమా తో హిందీలో అడుగు పెడుతున్నాడు.మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఛత్రపతి రీమేక్ తో హిందీలో అడుగు పెడుతున్న విషయం తెల్సిందే.
ఇక పుష్ప తో అల్లు అర్జున్.ఆర్ ఆర్ ఆర్( RRR ) సినిమా తో చరణ్, ఎన్టీఆర్ లు హిందీలో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాయి.

మరి కొన్ని సినిమాలు యూట్యూబ్ ద్వారా హిందీ ప్రేక్షకులను అలరించి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి కనుక మరి కొందరు హీరోలు కూడా హిందీలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎన్టీఆర్ వార్ 2 సినిమా లో నటించేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.వార్ 2 సినిమా లో ఎన్టీఆర్ పోషించబోతున్న పాత్రకు గాను రూ.35 కోట్ల పారితోషికం మాత్రమే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.మరీ ఇది తక్కువ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.కాస్త ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సింది కదా అంటూ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమా కు గాను ఎన్టీఆర్ దాదాపుగా రూ.50 కోట్ల ను దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.అయినా కూడా టాలీవుడ్ హీరోలు హిందీలో ఎక్కువ పారితోషికం దక్కించుకోలేక పోతున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.హిందీ నుండి వస్తున్న వారికి భారీ పారితోషికం ఇస్తున్నాం కానీ అక్కడ మాత్రం మన వారికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ తక్కువ పారితోషికం ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం అవుతోంది.







