సూపర్ స్టార్ మహేష్( Mahesh babu ) త్రివిక్రం కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా గుంటూరు కారం సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది.ఈ టీజర్ లో మహేష్ ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
గుంటూరు యాసలో బీడీ తాగుతున్న మహేష్ ని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.కొన్నాళ్లుగా మహేష్ పూర్తిగా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చారు.
మహేష్ నుంచి ఒక ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా ఆశిస్తుండగా త్రివిక్రం కరెక్ట్ టైం కు గుంటూరు కారం అని అనౌన్స్ చేశాడు.
ఇక మహేష్ లాంటి హీరో చేతిలో బీడీ పెట్టి బాబోయ్ అనిపించేశాడు.అయితే టాలీవుడ్ హిట్ సెంటిమెంట్ లో బీడీ కూడా ఒక భాగమే అని తెలుస్తుంది.అదెలా అంటే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ), నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇలా అందరు బీడీలు తాగి సూపర్ హిట్ కొట్టారు.
ఈతరం స్టార్స్ లో పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్ కూడా బీడీ తాగారు.ఇక ఇప్పుడు మహేష్ కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అయ్యి సూపర్ హిట్ కొట్టనున్నారు.
గుంటూరు కారం( Guntur Kaaram ) నశాలానికే ఎక్కేలా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.