బెల్లంకొండ బాబు ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకుని మన స్టార్ హీరోలు అవాక్కయేలా చేసేనా!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Srinivas )తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించారు.మొదటి చిత్రం అల్లుడు శీను ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేదు.

 Tollywood Hero Bellamkonda Sai Srinivas Hindi Movie Chatrapathy , Chatrapathy, B-TeluguStop.com

అయినా కూడా ఈ బెల్లంకొండ హీరో కెరియర్ లో దూసుకు పోతూనే ఉన్నాడు.సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలు చేస్తుండటం చూసి చాలా మంది హీరోలు అవాక్కయ్యారు.

ఇప్పుడు ఏకంగా హిందీ సినిమాని చేసేశాడు.అది కూడా రాజమౌళి ( Rajamouli )దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన చత్రపతి రీమేక్.

హిందీ లో చత్రపతి ని వివి వినాయక తెరకెక్కించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు.హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా ఛత్రపతి చిత్రాన్ని మార్చినట్లుగా సమాచారం అందుతుంది.

అదే సమయంలో భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేసేందుకు గాను ఏర్పాటు జరుగుతున్నాయి.

Telugu Bellamkonda, Chatrapathi, Tollywood, Vv Vinayak-Movie

ప్రస్తుతం సినిమా చివరి దశ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఈ సినిమా సక్సెస్ అయ్యి హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి గుర్తింపు వస్తే కచ్చితంగా మన స్టార్ హీరోలు నోరు వెళ్ళబెట్టాల్సిందే.చాలా మంది తెలుగు హీరోలు హిందీ లో సినిమాలు చేసి ఫ్లాప్‌ అయ్యారు.

తెలుగు సినిమాలనే హిందీ లో విడుదల చేసి కాస్త అలరిస్తున్నారు తప్పితే డైరెక్ట్‌ గా హిందీ సినిమాలు చేసి సక్సెస్ అయిన దాఖలాలు లేవు.అలాంటిది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏకంగా హిందీ సినిమా చేసి సక్సెస్ అయితే తెలుగు హీరోల్లో అత్యంత విభిన్నమైన హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నిలిచే అవకాశాలు ఉన్నాయంట ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసిన విషయం తెలిసిందే.హిందీ లో చత్రపతి సక్సెస్ అయితే తెలుగు లో సినిమాలు తగ్గించి హిందీలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కంటిన్యూ అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆలోచన ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube