బెల్లంకొండ బాబు ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకుని మన స్టార్ హీరోలు అవాక్కయేలా చేసేనా!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Srinivas )తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించారు.

మొదటి చిత్రం అల్లుడు శీను ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేదు.అయినా కూడా ఈ బెల్లంకొండ హీరో కెరియర్ లో దూసుకు పోతూనే ఉన్నాడు.

సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలు చేస్తుండటం చూసి చాలా మంది హీరోలు అవాక్కయ్యారు.

ఇప్పుడు ఏకంగా హిందీ సినిమాని చేసేశాడు.అది కూడా రాజమౌళి ( Rajamouli )దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన చత్రపతి రీమేక్.

హిందీ లో చత్రపతి ని వివి వినాయక తెరకెక్కించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు.

హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా ఛత్రపతి చిత్రాన్ని మార్చినట్లుగా సమాచారం అందుతుంది.అదే సమయంలో భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేసేందుకు గాను ఏర్పాటు జరుగుతున్నాయి.

"""/" / ప్రస్తుతం సినిమా చివరి దశ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

ఈ సినిమా సక్సెస్ అయ్యి హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి గుర్తింపు వస్తే కచ్చితంగా మన స్టార్ హీరోలు నోరు వెళ్ళబెట్టాల్సిందే.

చాలా మంది తెలుగు హీరోలు హిందీ లో సినిమాలు చేసి ఫ్లాప్‌ అయ్యారు.

తెలుగు సినిమాలనే హిందీ లో విడుదల చేసి కాస్త అలరిస్తున్నారు తప్పితే డైరెక్ట్‌ గా హిందీ సినిమాలు చేసి సక్సెస్ అయిన దాఖలాలు లేవు.

అలాంటిది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏకంగా హిందీ సినిమా చేసి సక్సెస్ అయితే తెలుగు హీరోల్లో అత్యంత విభిన్నమైన హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నిలిచే అవకాశాలు ఉన్నాయంట ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

హిందీ లో చత్రపతి సక్సెస్ అయితే తెలుగు లో సినిమాలు తగ్గించి హిందీలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కంటిన్యూ అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆలోచన ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మంగళగిరిలో లోకేష్ పరిస్థితేంటి ?