సంక్రాంతిలో( Sankranti ) 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ రికార్డు సృష్టించింది.అయితే సంక్రాంతి ఈ మేరకు సంబరాలు అందించడం ఇదేమి కొత్త కాదు.
కానీ ఆ సంబరాలు ఫిబ్రవరి రాగానే ఆవిరి అయిపోయాయి.కోట్ల రూపాయల కలెక్షన్స్ ముందు ఫిబ్రవరి వెలవెలబోతోంది.
ఇంకా అసలు సిసలైన మార్చ్ డ్రై పీరియడ్ ముందే ఉండగా ఫిబ్రవరిలోనే కష్టాల సుడిగుండాన్ని ఈదుతోంది టాలీవుడ్.( Tollywood ) ఇప్పటి వరకు ఈ నెలలో 25 సినిమాలు విడుదలయితే 50 కోట్ల రూపాయలు కూడా కలెక్షన్స్ సాధించలేదు అంటే ఇకపై మార్చ్ నెల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక సంక్రాంతి విషయానికి వస్తే హనుమాన్,( Hanuman ) గుంటూరు కారం,( Guntur Kaaram ) నా సామి రంగా( Naa Saami Ranga ) సినిమాలు కలెక్షన్స్ సునామిని సృష్టించాయి.

ఆ ఊపు ఫిబ్రవరిలో కనిపించక పోగా సినిమాల విడుదల లో మాత్రం ఏ మాత్రం గ్యాప్ లేదు.రవితేజ ఈగల్ సినిమాతో( Eagle Movie ) మరోమారు బాక్సాఫీస్ వెలిగిపోతుందని అందరూ అనుకున్న అది ఓపెనింగ్ ముచ్చటగానే ఉండిపోయింది ఓపెనింగ్ తో సరిపెట్టుకొని ఆ సినిమా చెక్ అవుట్ అయిపోయింది.ఆ తర్వాత ఊరు పేరు భైరవకోన,( Ooru Peru Bhairavakona ) అంబాజీ పెట్ మ్యారేజ్ బ్యాండ్( Ambajipeta Marriage Band ) వచ్చినా కూడా ఏం ఫలితం లేదు.ఇక గతంలో 2021 ఫిబ్రవరిలో ఉప్పెన సినిమా ప్రభాంహణం సృష్టించింది 2022 ఫిబ్రవరిలో డీజే టిల్లు వచ్చి అదరగొట్టింది.2023 ఫిబ్రవరిలో సార్ సినిమా వచ్చి మరో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

ఇక ఈ మూడు ఏళ్లగా వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే ఈ ఏడాది అసలు అందులో 10 శాతం కూడా ఫలితాలను దక్కించుకోలేదు.మార్చ్ ఎగ్జామ్స్ పీరియడ్ అయినప్పటికీ మంచి సినిమాలతోనే బాక్సాఫీస్ దుమ్ము దులుపుతాయని భావిస్తున్నారు.గోపీచంద్, వరుణ్ తేజ్, డీజే టిల్లు సీక్వెల్ సినిమాలు మార్చిలో రాబోతున్నాయి అలాగే ఏప్రిల్ మొదటి వారంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం కూడా రాబోతుంది.మరి చూడాలి ఫిబ్రవరి కష్టాలను మార్చి గట్టెక్కిస్తుందా లేదా అని.