Love stories : తొలిప్రేమతో పాటు చాలామంది హృదయాలను దోచేసిన రొమాంటిక్ సినిమాలు ఇవే…

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎన్నో రొమాంటిక్ సినిమాలు వస్తుంటాయి.వాటిలో కొన్ని మాత్రం చాలామందిని ఆకట్టుకుంటాయి.

ఇవి అద్భుతమైన లవ్ స్టోరీ లతో వస్తుంటాయి.అయితే గత వందేళ్లలో అద్భుతమైన ప్రేమ కావ్యాలుగా నిలిచిన సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.

వాటిని చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.అలాంటి సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టైటానిక్

( Titanic )

చారిత్రిక, కల్పిత అంశాలు రెండింటినీ కలిపి తీసిన అందమైన ప్రేమ కావ్యం టైటానిక్.(Titanic)హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో 1997లో రిలీజ్ అయిన టైటానిక్ మూవీ చాలామంది హృదయాలను దోచేసింది.ముఖ్యంగా ప్రేమికులకు బాగా నచ్చింది.

Advertisement

కేట్ విన్స్లెట్, లియోనార్డో డికాప్రియో ప్రేమికులుగా ఇందులో అద్భుతంగా నటించారు.ఈ సినిమా వాలెంటైన్స్ సందర్భంగా తప్పకుండా చూడాల్సిన వాటిలో ఒకటిగా ఉంటుంది.

దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే

( Dil Wale Dulhaniya Lejayenge )

1995లో రిలీజ్ అయిన మ్యూజికల్ రొమాన్స్ ఫిలిం దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే కూడా చాలామంది హృదయాలను గెలుచుకుంది.ఆదిత్య చోప్రా డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్ల నటించారు.భారతదేశం, లండన్, స్విట్జర్లాండ్‌లలో ఈ మూవీని తీశారు.

దీనిని తీసేందుకు 40 కోట్లు ఖర్చు కాగా 200 కోట్లు దాకా బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చాయి.లవర్‌తో కలిసి ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

తొలిప్రేమ

( tholiprema ) 

తొలిప్రేమ సినిమాకి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు.పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు.

ఆధ్య కోసం ఆ భాష నేర్చుకున్న పవన్ కళ్యాణ్...కూతురంటే అంత ఇష్టం మరి...
పనిమనిషి పాత్రల్లో నటించి చిరాకొచ్చింది.. అందుకే అలా చేశా.. నటి కామెంట్స్ వైరల్!

ఇందులో మనసుని హత్తుకునే పాటలు ఉంటాయి వీటిని దైవ కంపోజ్ చేశాడు.ఇక పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి లవ్ స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

Advertisement

ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది.

సీతారామం

( seetharam )

హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన "సీతారామం" సినిమా చాలామందికి ఫేవరెట్ మూవీగా మారిపోయిందని చెప్పవచ్చు.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రేమ పక్షులుగా నటించిన ఈ మూవీ ఇటీవల కాలంలో బెస్ట్ లవ్ స్టోరీ గా నిలిచింది.

లవ్ టుడే

( lovetoday )

ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన 2022 రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ టుడే కూడా చాలామందికి నచ్చింది.ఈ తమిళ సినిమాలో మోడర్న్ డే లవ్ ఎలా మారిందో చూపించారు.ఈ మూవీలో ప్రదీప్ రంగనాథం, ఇవానా హీరో హీరోయిన్లుగా కనిపించారు.

హృదయం

( hrudayam )

మళయాళ మూవీ "హృదయం"లో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్, దర్శన రాజేంద్రన్, కళ్యాణి ప్రియదర్శన్ యాక్ట్ చేశారు.ఈ మూవీ కూడా మంచి స్టోరీ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

తిరు

( thiru )

తమిళ మూవీ తిరుకి మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు.ఇందుhttps://telugustop.com/wp-content/uploads/2024/03/Tollywood-cute-love-stories-Thiru.jpgలో ధనుష్, నిత్యా మీనన్, భారతీరాజా, ప్రకాష్ రాజ్, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌లు కీలక పాత్రల్లో నటించారు.సింపుల్ మూవీ చాలామంది జీవితాలకు దగ్గరగా ఉంటుంది.అందుకే సూపర్ హిట్ అయింది.

తాజా వార్తలు