కరోనాతోప్రముఖ తెలుగు కమెడియన్ మృతి

కరోనా చాలా మందిని ప్రాణాలు తీసేస్తుంది.ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తన ఒడిలోకి చేర్చుకుంటుంది.

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్పటికే హిందీ, తమిళ్, మలయాళీ చిత్ర పరిశ్రమలో ప్రముఖులు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు.

ప్రముఖ రాజకీయ నాయకులు సైతం కరోనాతో కనుమరుగు అవుతున్నారు.ఇప్పడు ఈ లిస్టులో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ కమెడియన్ చేరిపోయారు.

ఇప్పటికే టాలీవుడ్‌లో కరోనా కారణంగా నిర్మాత పోకూరి రామారావుతో సహా మరో నిర్మాత కూడా కన్నుమూసాడు.ఇప్పుడు మరో ప్రముఖ నటుడు వేణుగోపాల్ కూడా కరోనాతో ప్రాణాలు వదిలాడు.

Advertisement

పేరు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా ఫేస్ చూస్తే ఈజీగా గుర్తుపడతారు.రాజమౌళి సినిమాల్లో ఈయన ఎక్కువగా నటించారు.

ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వేణుగోపాల్ దాంతో పాటు గతంలో విక్రమార్కుడు సినిమాలో కూడా నటించాడు.తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగానే నటించిన వేణుగోపాల్ కి కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు.

పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.వేణుగోపాల్ మరణంతో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మంచి నటుడుని కోల్పోయామని పలువురు తన సంతాపం తెలియజేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ రోజు అతని అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అయితే కరోనాతో మరణించడం వలన అతని మృతదేహాన్ని చూడాటానికి ఎవరూ వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు