హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తెలుగు యాంకర్ కొడుకు....

టాలీవుడ్ లో సినిమాలకు సంబంధించిన ఏ ఆడియో ఫంక్షన్ గాని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గాని, ఇతర షోలు అయినా గాని వ్యాఖ్యాతగా అంటే ముందుగా అందరికీ వినిపించే పేరు యాంకర్ సుమ.

ఈమె స్వతహాగా తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళ కాకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే అలరిస్తోంది.

అయితే తాజాగా యాంకర్ సుమ చేసినటువంటి ఓ ట్వీట్  నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ ట్వీట్ దేని గురించి పోస్ట్ చేసిందంటే తన కొడుకు రోషన్ తో దిగినటువంటి ఫోటోని అందులో షేర్ చేసింది.

ఈ ఫోటోకి తన ముద్దుల కొడుకు పెరిగి పెద్ద అయ్యాడుని లవ్ యు రా రోషన్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.అయితే  ఈ ఫోటోని నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాక చాలా యంగ్ గా కనిపించే సుమ అక్కకి ఎంత పెద్ద కొడుకు ఉన్నాడో అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల రోషన్ ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే టాలీవుడ్ సినీ పరిశ్రమలో సన్నిహితంగా ఉంటున్న టువంటి ఓ దర్శకుడి తో ఈ విషయం గురించి చర్చించినట్లు సమాచారం.అన్నీ కుదిరితే ఈ ఏడాది రోషన్ టాలీవుడ్ కి హీరోగా పరిచయమవునున్నాడు.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement

తాజా వార్తలు