తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly elections ) మొదలయ్యాయి.దాంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ మేరకు సామాన్యులు సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలు కట్టారు.తెలంగాణ బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు.ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3 నుంచి చేపట్టనున్నారు.కాగా టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ మేరకు సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రం వద్ద దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అందరికంటే ముందుగా హీరో సుమంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఆ తర్వాత టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu arjun ) వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేశాడు.
వాస్తవంగా ఓటేసేందుకు ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నది బన్నీనే ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు.ఆయన క్యూ లైన్‌లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి.
దీంతో అల్లు అర్జున్ గంటకు పైగానే క్యూ లోన్లోనే నిల్చున్నాడు.అలాగే జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో సహా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తారక్‌తో పాటు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు ఎన్టీఆర్ అమ్మగారు షాలిని కూడా ఉన్నారు.వారందరూ కూడా క్యూ లైన్లో నిల్చోని ఓటు వేశారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి( MM Keeravani ) తన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నాడు.యువత అందరూ నేడు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చాడు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఓటు హక్కును వినియోగించుకున్న సెలబ్రిటీలు ఓటు వేసినట్టుగా చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.