హీరోగా మారిన నటుడు ప్రవీణ్...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో నటుడు ప్రవీణ్( Actor Praveen ) ఒకరు.

ఈయన శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన కొత్తబంగారులోకం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు.

ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీ లో ఆయనకు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.కొత్త బంగారులోకం( Kotha Bangarulokam ) తర్వాత ఆయన వరుసగా బిల్లా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కార్తికేయ, స్వామి రారా, అఆ లాంటి వరుస సినిమాల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఆర్టిస్టులలో ఒకడు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఆయన పెద్దగా కనిపించడం లేదు కానీ ముందు సంవత్సరం వరకు కూడా ఆయన ప్రతి తెలుగు సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ మంచి గుర్తింపు పొందుతూ వచ్చాడు.

ప్రస్తుతం ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది దానికోసమే ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక ప్రవీణ్ ఇండస్ట్రీకి రావడానికి శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) చాలా వరకు ఆయనకు హెల్ప్ చేశారని ఆయనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.కొత్త బంగారులోకం సినిమా కంటే ముందు ఆయన వాళ్ళు ఊర్లో ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు.అప్పుడప్పుడు శ్రీకాంత్ అడ్డాల వస్తే ఆయనతో ఎక్కువ గా మాట్లాడేవాడు ప్రవీణ్ కి సినిమాలంటే చాలా ఇష్టం దానివల్ల శ్రీకాంత్ అడ్డాల కూడా అప్పుడు ఆయనతో ఎక్కువగా మాట్లాడేవాడు

దానివల్లే ప్రవీణ్ కి సినిమా అంటే ఇష్టం ఉందని శ్రీకాంత్ అడ్డాల గమనించి అతన్ని కొత్త బంగారులోకం సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం తీసుకోవడం జరిగింది.అలా ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు మంచి నటుడుగా ఎదిగారు.ఇక ఆయన ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఆర్టిస్టులందరితో కలిసి నటించాడు.

అలాగే టాప్ డైరెక్టర్లు అందరితో కూడా కలిసి పని చేశాడు.ప్రస్తుతం ఆయన హీరోగా ఒక సినిమా వస్తుంది కాబట్టి ఆయన ఎక్కువగా సినిమాలు చేయట్లేదు అనే విషయం అర్థమవుతుంది.

మరి ఈయన హీరోగా చేసిన సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు