నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ.

లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

జిల్లాలోని ఈ క్రింది రైతు వేదికల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని పేర్కొన్నారు.వేములవాడ మండలం మారపాక, చందుర్తి, బోయినపల్లి మండలం కొదురుపాక, కోనరావుపేట మండలం నిజామాబాద్, వేములవాడ అర్బన్ మండలం హన్మాజీపేట, తంగళ్ళపల్లి మండలం తాడూరు, ముస్తాబాద్ మండలం బదనకల్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ఇల్లంతకుంట, వీర్నపల్లి, రుద్రంగి రైతు వేదికల్లో కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వివరించారు.

వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని రైతు వేదికలు, గ్రామపంచాయతీ భవనాల వద్ద రైతుల రుణ మాఫీ వివరాల జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు.రుణమాఫీ పొందే రైతులు వారి గ్రామాల్లోని ఆయా ప్రదేశాల వద్ద జాబితా సరిచూసుకోవాలని కోరారు.

Advertisement

రైతు వేదికల వద్ద కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.రైతు రుణమాఫీ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సందేశం ఇవ్వనున్నారని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు.రైతు వేదికల వద్ద నిర్వహించనున్న కార్యక్రమాలకు రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

ఇక్కడ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News