గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాల లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయి.ఒకప్పుడు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే భయపడిన దర్శకనిర్మాతలు ఇప్పుడు అలవోకగా సినిమా కోసం 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
కల్కి సినిమా బడ్జెట్ ఏకంగా 600 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.అయితే ప్రధానంగా ఐదుగురు టాలీవుడ్ దర్శకులు ఈ జాబితాలో ఉన్నారు.
ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Star Director Rajamouli ) గురించి మొదట చెప్పుకోవాలి.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
మరో దర్శకుడు ప్రశాంత్ నీల్( Directed Prashant Neel ) సైతం వరుసగా భారీ సినిమాలను తెరకెక్కిస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.ప్రశాంత్ నీల్ సలార్ తో మరో సక్సెస్ అందుకోగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.నాగ్ అశ్విన్( Nag Ashwin ) సైతం కల్కితో టాలీవుడ్ స్థాయిని పెంచేశారనే చెప్పాలి.స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) సైతం వయొలెన్స్ తో కూడిన సినిమాలను తెరకెక్కించి హిట్లు సాధించారు.
మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ( Directed Prashant Verma ) హనుమాన్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.టాలీవుడ్ డైరెక్టర్లు భవిష్యత్తులో సైతం భారీ విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ సైతం మరింత పెరిగేలా దర్శకనిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.