ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి.ఈరోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
సభలో మొత్తం తొమ్మిది బిల్లులు, నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.అదేవిధంగా సీఆర్డీఏ బిల్లుతో పాటు 2020-21 కాగ్ ఆడిట్ రిపోర్ట్ ను అసెంబ్లీకి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు.
అయితే, గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం లభించింది.







