టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం.ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల విషయం కూడా కురిపించింది.
ఇప్పటికే తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ శర్వానంద్ కి సరైన గుర్తింపు దక్కలేదు.అంతేకాకుండా కెరియర్లో చెప్పుకోదగ్గ ఒక హిట్టు సినిమా కూడా లేదు.
కానీ తాజాగా విడుదలైన సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకోవడంతోపాటు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు శర్వానంద్.
కాగా ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా అమల అక్కినేని,ప్రియదర్శి,వెన్నెల కిషోర్ ముగ్గురు కీలకపాత్రలో నటించి మెప్పించారు.
ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది.
సెన్సిబుల్ సినిమాను చేశాం.ప్రేక్షకులు కచ్చితంగా సినిమాకు కనెక్ట్ అవ్వాలని బలంగా అనుకుంటున్నాము.

మేము ఊహించిన విధంగాగే అందరికీ ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.కొత్త సినిమాలు గురించి కొంత కంగారు కూడా మొదలైంది ఆనందంగా చెప్పుకొచ్చాడు శర్వానంద్.మంచి కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఇక నాకు అఖిల్ అక్కినేని చిన్నప్పటి నుంచి తెలుసు.అమలా గారు నాగార్జున గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఈ సినిమాతోనే మొదలైంది.అమల గారు నిజంగానే నన్ను మూడో కొడుకులా చూస్తారు.
ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పుకొచ్చాడు శర్వానంద్.మొత్తానికి శర్వానంద్ మాటలను బట్టి చూస్తే ఈ సినిమా సక్సెస్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది.







