నేడు 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

టిడ్కో లబ్ధిదారులకు( Tidco houses ) అండగా.రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు.

 Today 8,912 Tidco Houses Will Be Distributed To The Beneficiaries, Chief Minist-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందజేత.తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి…గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి 20 ఏళ్లపాటు నెలకు రూ.3,000 చొప్పున అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి…మన ప్రభుత్వం 300 చ॥అ॥ల ఈ టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే ఇస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులపై తగ్గనున్న భారం అక్షరాల రూ.10,339 కోట్లు.

365 చ॥అ 430 చ॥అ ఇళ్ళకు ముందస్తు వాటాలో 50% రాయితీ 365 చ॥అ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు 44, 304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 74,312 మంది 430 చ॥అ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వారు ముందస్తు వాటాగా చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని జగనన్న ప్రభుత్వమే భరిస్తూ, మరో రూ.4,626 కోట్లను సబ్సిడీగా అందిస్తున్న ప్రభుత్వం.ఉచిత రిజిస్ట్రేవున్లు, మౌళిక వసతులకు పెద్దపీట గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ళు ప్రతిపాదించిన ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం, రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులను సైతం నిర్లక్ష్యం చేస్తే.అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను కట్టించి మరీ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.

టిడ్కో ఇళ్ళకు రిజిస్ట్రేషన్లు కూడా ఉచితం.తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ఉచిత రిజిస్ట్రేషన్ రూపేణా “మరో రూ.60 వేల లబ్ధి…రూ.16,601 కోట్ల లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.11,672 కోట్లు.ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ.482 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.1200 కోట్లు.మౌలిక వసతులకు మరో రూ.3,247 కోట్లు కలిపి మొత్తంగా రూ.16,601 కోట్ల మేర లబ్ధి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం( Y.S.Jagan Mohan Reddy )ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ 21 లక్షల నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం .

రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల ఇళ్ల పట్టాల కనీస విలువ రూ.77 వేల కోట్లు…ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తూ, రూ.35వేల పావలా వడ్డీ రుణం స్టీల్, సిమెంట్, కిటికీలు, డోర్లు, ఇతర నిర్మాణ సామాగ్రి తక్కువ ధరకు అందిస్తూ.నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు”లో భాగంగా 21 లక్షల మందికి ఇళ్లను కట్టిస్తూ ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షల చొప్పున చేస్తున్న మొత్తం వ్యయం రూ.56,700 కోట్లు.మౌలిక వసతులకు చేస్తున్న మొత్తం ఖర్చు రూ.33 వేల కోట్లు.జగనన్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై చేస్తున్న వ్యయం, ఇప్పటికే అందించిన 30.6 లక్షల ఇళ్ల పట్టాల విలువ కలిపి మొత్తం అక్షరాల రూ.1,66,700 కోట్లు…

గుడివాడ( Gudivada )లో గృహ నిర్మాణ యజ్ఞం.గుడివాడ నియోజకవర్గంలో ఇళ్లపట్టాలు, జగనన్న కాలనీ ఇళ్ళుగుడివాడ నియోజకవర్గంలో 84 “వైఎస్సార్-జగనన్న“లే అవుట్లలో 13, 145 ఇళ్ల పట్టాలు మంజూరు… వీటి విలువ దాదాపు రూ.657 కోట్లు.నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల క్రింద 8,859 ఇళ్ల మంజూరు.వీటి విలువ దాదాపు రూ.239 కోట్లు.మౌలిక వసతులకు మరో రూ.87 కోట్లు.ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌలిక వసతులతో కలిపి గుడివాడలో అందిస్తున్న ఇళ్ల విలువ రూ.983 కోట్లు.గుడివాడలో టిడ్కో ఇళ్లుమొత్తం టిడ్కో ఇళ్లు : 8,912, గృహ నిర్మాణం, మౌలిక వసతులు, స్థల సేకరణకు చేసిన మొత్తం వ్యయం రూ.799.19 కోట్లుకేవలం గుడివాడ నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై చేసిన వ్యయం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల విలువ కలిపి మొత్తం రూ.1,782కోట్లు…అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్టేషన్లు… తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు అక్కడ ఉన్న ఇంటి స్థలం విలువను బట్టి కనీసం రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు లబ్ధి… రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం అంటే రూ.2 లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube