సలార్ సినిమాకు, కేజిఎఫ్ సినిమాకు లింక్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది ఒక్క డైరెక్టర్ నే కావడంతో ఈ రెండింటికి లింక్ పెట్టినట్టు తాజా టాక్.
మరి ఇంతకీ ఆ లింక్ ఏంటి? ఎందుకు ఆ వార్తలు వైరల్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి.
కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.
మరి తాజాగా ఈ సినిమాకు నీల్ ఇటీవలే తీసిన కేజిఎఫ్ పార్ట్ 2 కు లింక్ ఉందని తాజాగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
వస్తున్న రూమర్స్ ప్రకారం బొగ్గు గనుల్లో పని చేసే ఒక మాస గ్యాంగ్ లీడర్ గతంలో తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు క్రిమినల్ గ్యాంగ్స్ ను ఎలా మట్టుబెట్టాడు అనేది సలార్ కథాంశం అట.మరి ప్రశాంత్ మల్టివర్స్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సలార్( Salar ) గతంలో తన స్నేహితుడు అయిన రాఖీ భాయ్ కి చనిపోయే ముందు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు సిద్ధం అవుతాడని ఆ విధంగా కేజిఎఫ్ కు సలార్ కు లింక్ ఉందని అంటున్నారు.చూడాలి ఇది ఎంత వరకు నిజమో.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.