పొగాకు పంటను ఆకుముడత తెగుళ్ల బెడద నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

పొగాకు పంట( Tobacco Crop ) వర్షాధార పంటగా నల్లరేగడి భూములలో అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంట.పొగాకు పంటకు నీటి అవసరం చాలా తక్కువ.

 Tobacco Crop Leaf Curl Disease Preventive Measures Details, Tobacco Crop, Leaf C-TeluguStop.com

కేవలం వర్షాల వల్ల నేలలో ఏర్పడే తేమ వల్ల సాగు చేయవచ్చు.ఒకవేళ ఎండ బెడద ఎక్కువగా ఉంటే ఒకటి లేదా రెండు సార్లు నీటి తడులు అందిస్తే సరిపోతుంది.

పొగాకు పంట సాగుకు ముందు సంవత్సరం నత్రజని అధికంగా వేసిన నేలలు, లోతట్టు నేలలు, మురుగునీరు బయటకు పోయే సదుపాయం లేని నేలలు పనికిరావు.ముఖ్యంగా పొగాకు సాగు( Tobacco Cultivation ) చేసే నేలలో క్లోరైడ్ మోతాదు 100ppm కంటే తక్కువగా ఉండాలి.

పొగాకు నాటుకునేందుకు అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ రెండవ వారం వరకు అనుకూలమైన సమయం.ఒక హెక్టారులో 28500 మొక్కలు నాటుకోవచ్చు.పొగాకు నారు నాటిన పది రోజుల తర్వాత చనిపోయిన లేదంటే నాసిగా ఉండే మొక్కలను తీసేసి కొత్త మొక్కలను నాటుకోవాలి.పొగాకు నారు నాటిన 20,30,45 రోజులకు అంతర కృషి చేయాలి.

ఇలా చేయడం వల్ల నేల పగుళ్లు కప్పబడి తేమ ( Moisture ) నిల్వ ఉండడంతో పాటు కలుపు మొక్కలు నాశనం అవుతాయి.

పొగాకు పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే ఆకుముడత తెగుళ్లు( Leaf Curl Pests ) ఊహించని నష్టం కలిగిస్తాయి.అయితే ఈ తెగుళ్లను పూర్తిస్థాయిలో అరికట్టే రసాయన పిచికారి మందులు అందుబాటులో లేవు.కాబట్టి ఈ తెగుళ్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ తెగుళ్లు తెల్ల దోమ వల్ల వ్యాపిస్తుంది కాబట్టి తెల్ల దోమను అరికట్టాలి.నారుమడిలో నారు తీయడానికి వారం రోజుల ముందు 2.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రేడ్ 200ఎస్.ఎల్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆకు ముడత తెగుళ్లు లేదంటే తెల్ల దోమ ఆశించిన మొక్కలు తక్కువగా ఉంటే వాటిని తొలగించి నాశనం చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube