Anasuya Galodu : గాలోడు టైటిల్ తో సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి: అనసూయ

సుడిగాలి సుధీర్ హీరోగా గెహ్నా సిప్పి హీరోయిన్‌గా రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గాలోడు.

ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ కమెడియన్గా తన ప్రస్థానం మొదలుపెట్టిన సుధీర్ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదగడమే కాకుండా వెండితెరపై సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఇక ఈయన నటనకు విపరీతమైన అభిమానులు ఉండడంతో ఏకంగా ఈయనకు హీరోగా అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గాలోడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ సుధీర్ గురించి గాలోడు సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్ వేణు వండర్స్ టీం లో కమెడియన్ గా ఉన్నప్పటి నుంచి టీం లీడర్ గా ఎదిగారు.

Advertisement

మనలో ఉన్న టాలెంట్ ను ఎవరు ఆపలేరు అయితే సుదీర్ సక్సెస్ చూస్తే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.కేవలం తాను సుధీర్ కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని ఈమె వెల్లడించారు.ఇక గాలోడు అనే టైటిల్ పెట్టుకొని సినిమా చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలని ఈ సందర్భంగా అనసూయ ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు