ఆధార్ కార్డులో (Aadhaar card)పేరు, జెండర్, అడ్రస్, పుట్టిన తేదీ వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే మీ సేవకు వెళ్లకుండానే ఇంట్లో నుండే సరి చేసుకోవచ్చు.అయితే ఈ వివరాలను సరి చేసుకునే విధానం.
అందుకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం.మై ఆధార్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
ముందుగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది.ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెబ్సైట్ లోని ఆధార్ లో లాగిన్ అవ్వాలి.
స్క్రీన్ పై ఆన్లైన్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిని క్లిక్ చేస్తే పుట్టిన తేదీ, అడ్రస్, పేరు, జెండర్ లాంటి ఆప్షన్లు కనిపిస్తాయి.

ఏ వివరాలను అప్డేట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ సరైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయని యెడల రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది.కాబట్టి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం.కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఇండియన్ పాస్ పోర్ట్ (Indian Passport), పెన్షనర్ ఫోటో ఐడెంటిటీ కార్డు(Pensioner Photo Identity Card), ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఐడెంటి కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఎగ్జామ్ మార్క్ షీట్, గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ సర్టిఫికెట్, ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు లలో ఏదో ఒకటి అప్లోడ్ చేయవచ్చు.
ఇక మీ ఆధార్ కార్డులో తప్పు వివరాలను సరిచేసి పైన ఉండే డాక్యుమెంట్లలో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి.మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కు.సరిచేసిన వివరాలు ఒకటే ఉంటే వెంటనే మీ రిక్వెస్ట్ సక్సెస్ అవుతుంది.ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఆధార్ కార్డులు సరి చేసుకోవచ్చు.







