తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా నేడు ఐదవ రోజు భక్తులు మాతంగి వేషం లో గంగమ్మకు మ్రొక్కులు సమర్పించుకుంటున్నారు.ఉదయం నుంచే ఆలయంకు భక్తుల భారీగా చేరుకుంటున్నారు.
చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రకరకాల వేషధారణలు ధరించి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
నేడు ఐదవ రోజు మాతంగి వేషం కావడంతో భక్తులు వేషధారణలో లో ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నారు.( జంబలకిడీ పంబ )మగవారు ఆడవారికి ఏమాత్రం తీసుపోని విధంగా కట్టు, బొట్టుతోపాటు మల్లెపూలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.కోరిన కోరికలు నెరవేరితే ఇలా మాతంగి వేషం వేసి అమ్మవారినీ దర్శించు కోవడం ఇక్కడి ప్రత్యేకత.