ఒకపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో తిరుపతి ;లో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అక్కడి అధికారులు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.స్వాబ్ టెస్ట్ ల కోసం శాంపిల్స్ తీసుకోగా వారిలో 236 మంది ఆచూకీ అంతుచిక్కకపోవడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
శ్వాబ్ టెస్ట్ లలో పాజిటివ్ వచ్చిన వారు నేరుగా ఆసుపత్రుల లో చేరకుండా ఉండడం, అలానే శాంపిల్స్ తీసుకొనే సమయంలో సరైన వివరాలు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి విచిత్ర పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు కరోనా లాబ్ టెస్ట్ ల విషయంలో అధికారులు చేపడుతున్న విధానాలలో మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
టెస్ట్ శాంపిల్స్ తీసుకుంటున్న సమయంలో తప్పుడు అడ్రస్ లతో పాటు రాంగ్ ఫోన్ నంబర్స్ ఇస్తుండడం తో వారంతా కూడా జనావాసాల్లోనే తిరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వారి ఆచూకీ లభించకపోవడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
దీంతో చేసేదేమీ లేక వారందరిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.మరోపక్క దీనిపై కలెక్టర్ భత్ నారాయణ గుప్తా కూడా సరైన చర్యలకు ఉపక్రమించడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.
తిరుమల లో రోజుకు నమోదు అవుతున్న పాజిటివ్ కేసులలో కనీసం 20 కేసుల వరకు ఇలానే తప్పుడు సమాచారం తో నమోదు అవుతున్నాయి అని, కరోనా వంటి మహమ్మారి విషయంలో ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితులు ఎలా చక్కబడతాయి అని అధికారులు గోలపెడుతున్నారు.అయితే ఈ సమస్యను అధిగమించడం కోసం ఈ సారి నుంచి స్వాబ్ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఆ పర్సన్ ఫోన్ కు ఓటీపీ సిస్టమ్ అనేది అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ఇక నుంచి ఎవరైనా స్వాబ్ పరీక్షలు చేయించుకొనే తప్పనిసరిగా వారు వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ నే ఇవ్వాల్సి ఉంటుంది దీనితో ఎలాంటి రాంగ్ నంబర్స్ నమోదయ్యే అవకాశాలు ఉండబోవని అధికారులు భావిస్తున్నారు.