తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు..

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.ముందుగా స్వామి వారికి నిర్వహించే ప్రాత:కాల ఆరాధనలు పూర్తైన తర్వాత అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించింది టిటిడి.ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.

 Tirumala Srivari Vaikuntha Darshan Begins Devotees Are Flocking In Large Numbers-TeluguStop.com

ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో 300, ఆఫ్‌లైన్‌లో టోకెన్లు పొందారు.

ఇవాళ్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్దేశిత టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామిని తిరుమల శ్రీవారిని ఎస్వీ బట్ కేరళ హై కోర్టు నాయమూర్తి, ఏపీ హై కోర్టు నాయమూర్తి రవేంద్ర బాబు, ఏపీ హై కోర్టు నాయమూర్తి రావినాథ్ తిలహరి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, ఏపీ హై కోర్టు నాయమూర్తి రాజశేఖర్ రావు,‌ తెలంగాణ హై కోర్టు సూర్యపల్లి నంద, ఏపీ హై కోర్టు నాయమూర్తి గంగారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి,కర్ణాటక హై కోర్టు దినేష్ కుమార్, ఎమ్మెల్యే అంబంటి రాంబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, గవర్నమెంట్ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మినిష్టర్ ఉషశ్రీ చరణ్ ,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ హై కోర్టు ev వేణుగోపాల్, తేవర్చంగ్ గలట్ కర్ణాటక గవర్నర్, మినిష్టర్ మెరుగు నాగార్జున, తమిళనాడు సీజే టి రాజా, గుడివాడ అమర్నాథ్ మినిస్టర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మినిష్టర్ విశ్వరూప్, ఏపీ మినిస్టర్ జయరాం, కోళ్లు రవేంద్ర టీడీపి మాజీ మంత్రి, కోన రఘుపతి, ఎమ్మెల్యే రఘునందన్,కడియం శ్రీహరి, దేవి గౌడ కుమారుడు రేవన్న, ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మినిస్టర్ కరుమూరి వెంకట నాగేశ్వరరావు,తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్, తెలంగాణ బిజెపి నాయకుడు కే లక్ష్మణ్, యాక్టర్ రాజేంద్రప్రసాద్, అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే,వేల్లంపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యే, ప్రకాశ్ జవదేకర్ ఎంపీ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా వైకుంఠ ద్వార గుండా స్వామి వారి‌ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.అనంతరం‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఉందో అభివృద్ధి అదే అభివృద్ధి కొనసాగాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తాడుకుంటున్నారని వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థించామన్నారు.గతంలో కూడా చంద్రబాబు నాయుడు పుష్కరాల సమయంలో 30 మంది ప్రాణాలు పోగొట్టారని అదేవిధంగా ఇప్పుడు కూడా సామాన్య ప్రజల ప్రాణాలు ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసులు తెలిపారు.

టిడిపి మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.నూతన సంవత్సరంలో అయిన ప్రభుత్వం మారి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube