పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్.ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్న సమస్య ఇది.
పీసీఓఎస్ ఉండే వారిలో హార్మోన్ల అసమతుల్యత, బరువు భారీగా పెరిగి పోవడం, జుట్టు తీవ్రంగా రాలి పోవడం, అండాశయంలో నీటి బుడగలు, చర్మంపై అధిక జిడ్డు ఉత్పత్తి కావడం, మొటిమలు వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తుంటాయి.అలాగే పీసీఓఎస్ ఉన్న వారిలో సంతాన లేమి కూడా ఒక లక్షణమే.
అలా అని పీసీఓఎస్ వస్తే ఎప్పటికీ పిల్లలు పుట్టరా? జీవితాంతం గొడ్రాలుగానే మిగిలిపోవాల్సిందేనా? అంటే.అక్కర్లేదనే చెబుతున్నారు నిపుణులు.
నిజానికి పీసీఓఎస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధే.అయినప్పటికీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓఎస్ ఉన్నా.గర్భాన్ని పొందొచ్చు.పండంటి బిడ్డకీ జన్మనివొచ్చు.
మరి పీసీఓఎస్ ఉన్నా గర్భం పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీని కోరుకునే పీసీఓఎస్ బాధిత మహిళలు మొదట బరువును అదుపులోకి తెచ్చుకోవాలి.
బరువు కంట్రోల్లో ఉంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది.ఫలితంగా గర్భధారణ సులువవుతుంది.
పీసీఓఎస్ ఉన్నా గర్భం దాల్చాలనుకునే మహిళలు ఖచ్చితంగా తమ డైట్లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి.ఆకుపచ్చని కూరగాయలు, అరటి పండ్లు, నట్స్, గుమ్మడి గింజలు, దానిమ్మ పండ్లు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బ్రొకోలీ, బ్రౌన్ రైస్, వెల్లుల్లి, స్వచ్ఛమైన తేనె, సిట్రస్ పండ్లు, బ్రొకోలి, సీ ఫుడ్, పాలు వంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా గర్భాశయ సమస్యలు దూరమై త్వరగా మాతృత్వాన్ని పొందుతారు.
అలాగే పీసీఓఎస్ ఉన్న మహిళలు సంతానం కావాలని కోరుకుంటే.ప్రతి రోజు తప్పకుండా వ్యాయామాలు చేయాలి.ఇన్సులిన్ స్థాయులను కంట్రోల్లో ఉంచుకోవాలి.ఫ్యాటీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లను నివారించుకోవాలి.ఇక పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంటుంది.
అందు వల్ల కూడా గర్భం పొందలేకపోతుంటారు.అందుకే డైట్లో విటమిన్ డి ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.