వ్యవసాయం చేస్తూ చదివించిన తల్లి.. గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన కొడుకు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా సక్సెస్ సొంతం కావాలంటే ఎంతో కష్టపడాలి.ఏపీపీఎస్సీ గ్రూప్1 ర్యాంకర్ తిప్పయ్యగారి రమేష్( Tippaiyagari Ramesh ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.

 Tippaiyagari Ramesh Success Story Details, Tippaiyagari Ramesh , Tippaiyagari Ra-TeluguStop.com

తన సక్సెస్ గురించి రమేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.అమ్మ చెప్పిన మాటలు తనలో కసిని పెంచాయని రమేష్ చెప్పుకొచ్చారు.

అనంతపూర్ జిల్లా( Anantapur ) ఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన రమేష్ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

లక్ష్యం కోసం ప్రయత్నించే సమయంలో ఎదురుదెబ్బలు, ఓటములు సాధారణం అని ఓడిపోవడానికి కారణాలను గుర్తించి ప్రయత్నిస్తే సక్సెస్( Success ) సొంతమవుతుందని రమేష్ చెబుతున్నారు.

మాది వ్యవసాయ కుటుంబమని( Agriculture Family ) చిన్న వయస్సులోనే నాన్న మృతి చెందాడని రమేష్ చెప్పుకొచ్చారు.అమ్మ ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ పోషించిందని రమేష్ కామెంట్లు చేయడం గమనార్హం.

మా ఊరి ఆర్డీవో( RDO ) సార్ లా నేను ఎదగాలని అమ్మ భావించారని రమేష్ చెప్పుకొచ్చారు.ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రమేష్ పదో తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు.గురుకుల జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివిన రమేష్ ఆ తర్వాత బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ చదివారు.నేను గ్రూప్1 జాబ్ కు( APPSC Group 1 ) ఎంపిక కావడంతో అమ్మ ఎంతో సంతోషించారని రమేష్ తెలిపారు.

చిన్నప్పుడు అమ్మ పడ్డ కష్టం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోందని పేదరికాన్ని రూపుమాపడానికి నా వంతు కష్టపడుతున్నానని రమేష్ చెప్పుకొచ్చారు.కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఉన్న జీజీహెచ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా( Administrative Officer ) ఏపీ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చిందని రమేష్ కామెంట్లు చేశారు.విద్యతోనే పేదరికంను రూపుమాపే అవకాశం అయితే ఉంటుందని రమేష్ కామెంట్లు చేశారు.రమేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Tippaiyagari Ramesh Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube