వ్యవసాయం చేస్తూ చదివించిన తల్లి.. గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన కొడుకు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా సక్సెస్ సొంతం కావాలంటే ఎంతో కష్టపడాలి.ఏపీపీఎస్సీ గ్రూప్1 ర్యాంకర్ తిప్పయ్యగారి రమేష్( Tippaiyagari Ramesh ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.

తన సక్సెస్ గురించి రమేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

అమ్మ చెప్పిన మాటలు తనలో కసిని పెంచాయని రమేష్ చెప్పుకొచ్చారు.అనంతపూర్ జిల్లా( Anantapur ) ఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన రమేష్ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

లక్ష్యం కోసం ప్రయత్నించే సమయంలో ఎదురుదెబ్బలు, ఓటములు సాధారణం అని ఓడిపోవడానికి కారణాలను గుర్తించి ప్రయత్నిస్తే సక్సెస్( Success ) సొంతమవుతుందని రమేష్ చెబుతున్నారు.

మాది వ్యవసాయ కుటుంబమని( Agriculture Family ) చిన్న వయస్సులోనే నాన్న మృతి చెందాడని రమేష్ చెప్పుకొచ్చారు.

అమ్మ ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ పోషించిందని రమేష్ కామెంట్లు చేయడం గమనార్హం.

"""/" / మా ఊరి ఆర్డీవో( RDO ) సార్ లా నేను ఎదగాలని అమ్మ భావించారని రమేష్ చెప్పుకొచ్చారు.

ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రమేష్ పదో తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు.

గురుకుల జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివిన రమేష్ ఆ తర్వాత బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ చదివారు.

నేను గ్రూప్1 జాబ్ కు( APPSC Group 1 ) ఎంపిక కావడంతో అమ్మ ఎంతో సంతోషించారని రమేష్ తెలిపారు.

"""/" / చిన్నప్పుడు అమ్మ పడ్డ కష్టం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోందని పేదరికాన్ని రూపుమాపడానికి నా వంతు కష్టపడుతున్నానని రమేష్ చెప్పుకొచ్చారు.

కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఉన్న జీజీహెచ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా( Administrative Officer ) ఏపీ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చిందని రమేష్ కామెంట్లు చేశారు.

విద్యతోనే పేదరికంను రూపుమాపే అవకాశం అయితే ఉంటుందని రమేష్ కామెంట్లు చేశారు.రమేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరగాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!