మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja )నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.( Tiger Nageswara Rao ) ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు.
నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటూ అంచనాలు పెంచేశారు.

దీంతో మాస్ రాజా ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ అలాగే ఈ మధ్య వచ్చిన టీజర్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ తర్వాత టైగర్ పై మరింత హైప్ పెరగడంతో మార్కెట్ లో ఈ సినిమా హక్కులకు డిమాండ్ పెరిగినట్టే చెబుతున్నారు.
అంతేకాదు బిజినెస్ నెక్స్ట్ లెవల్లో జరుగుతుందట.

హాట్ కేకుల్లా టైగర్ నాగేశ్వరరావు రైట్స్ అమ్ముడు పోతున్నాయి అని సమాచారం.థియేట్రికల్ హక్కులు మాత్రమే కాక నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ ధర పలుకుతున్నాయని అయినా కొనేందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నట్టు టాక్.ఇక నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ( Gayatri Bhardwaj )హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అలాగే ఈ సినిమాను అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.







