ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడి వైసిపి అధిష్టానం ఆగ్రహానికి గురై .సస్పెన్షన్ వేటు వేయించుకున్న నలుగురు వైసిపి ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుపై గత కొద్ది రోజులుగా సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్చార్జిలను నియమించింది. సస్పెన్షన్ కు గురైన వారిలో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,( Kotam Reddy Sridhar Reddy ) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.
వీరు నలుగురు తెలుగుదేశం లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది .

వీరి చేరికను ఆయా నియోజకవర్గాల్లోని టిడిపి క్యాడర్ వ్యతిరేకిస్తున్న, అధినేత చంద్రబాబు( Chandrababu ) మాత్రం వీరిని చేర్చుకునే విషయంలో కీలక నాయకులతో చర్చిస్తున్నారు అయితే ఈ నలుగురిలో ఇద్దరికే టిడిపి టికెట్ దక్కి అవకాశం కనిపిస్తుంది.ఆ ఇద్దరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారట.రాబోయే ఎన్నికల్లో టికెట్ హామీ లభించడంతోనే వారు ముందుగానే రెబల్ గా మారి పార్టీ అధిష్టానం పై విమర్శలు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు చర్చి జరుగుతోంది .వీరిద్దరూ టిడిపిలో చేరినా.రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఆలోచన టిడిపి అధిష్టానానికి లేదట .దీనికి కారణం ఉదయగిరి నియోజకవర్గం లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతో పాటు, ఆయన అనారోగ్య పరిస్థితి కూడా కారణమట.తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీలో చేర్చుకునే అవకాశం కూడా లేనట్టు తెలుస్తోంది.దీనికి కారణం తాడికొండ నియోజకవర్గంలో శ్రీదేవి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడం, అవినీతి ఆరోపణలు కూడా కారణమట.
దీంతో ఆమె జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం.