ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
అయితే పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న తుమ్మలకు జాబితాలో చోటు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలోనే అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఆయన కాంగ్రెస్ లోకి చేరనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తుమ్మల హస్తం కండువా కప్పుకోనున్నారని సమాచారం.







