పాడైన జాతీయ జెండాను విసిరేస్తున్నారా? దానికో నియమం ఉందనే విషయం తెలుసా?

భారత దేశ వ్యాప్తంగాహర్‌ఘర్ తిరంగాకార్యక్రమం షురూ అయింది.భారత దేశ పౌరులంతా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌”లో భాగంగా ప్రతి ఇల్లు, కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.

 Throwing Away A Damaged National Flag Did You Know There Is A Rule For That  Ind-TeluguStop.com

ఈ క్రమంలో ప్రధాని మోదీ పిలుపును అందరూ తూచా పాటిస్తున్నారు.ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ హర్ ఘర్ తిరంగా కొనసాగించాలని ప్రధాని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా అందరి గుండెల్లో దేశభక్తి పొంగిపొర్లుతోంది.

ఏదో ఫార్మల్‌గా జెండా ఎగరేశామంటే ఎగరేశాం అన్నట్టుగా కాకుండా, ఈ త్రివర్ణ పతాక స్ఫూర్తిని గుండెల నిండా నింపుకోవాలనేదే ప్రధాన ఉద్దేశం.

ఇకపోతే మనకందరికీ ఓ విషయంలో అనుమానం ఉంటుంది.

ప్రతి ఆగస్టు 15 నాడు మనం ఎంతో దేశభక్తితో ఎగుర వేసే జెండా మరుసటి సంవత్సరం నాడు పాతది అయిపోతుంది.అలాగే కొన్ని కారణాలవలన చినిగి పోవడం అనేది జరుగుతుంది.

ఇలాంటివి మనం బయటపడేస్తుంటాం.అలా పడేసేటప్పుడు మనమనసుకి ఎంతో బాధగా అనిపిస్తుంది.

అది ఏ చెత్తకుప్పలో మనం చూసినపుడు గుండె చివుక్కుమంటుంది.అయితే పాడైపోయిన జెండాలను ఏవిధంగా కనుమరుగయ్యేలా చేయాలి అనే విషయంలో కొన్ని నియమాలు వున్నాయి.

దురదృష్టవశాత్తు అవి చాలామందికి తెలియదు.ఇపుడు దాని గురించి తెలుసుకుందాం.

Telugu Dismadle, India Flag, Latest, Ups, Tips-Latest News - Telugu

2002లో తీసుకొచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆధారంగా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ జెండా ఎగరేయాలి.అలాగే ఆ జెండా పాడైనపుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. డ్యామేజ్ అయిన జెండాను ఎగరేయకూడదు.జాతీయ జెండా ఎగిరే పోల్‌ చివరన పూలు కానీ, ఇతరత్రా ఎంబ్లెమ్‌లు కానీ ఉంచకూడదు.కేవలం జెండా మాత్రమే కనిపించాలి.జాతీయ జెండాకు పక్కన, దానికి మించిన ఎత్తులో మరే జెండా ఎగరకూడదు.

పొరపాటున త్రివర్ణ పతాకం చినిగిపోతే.ఎక్కడ పడితే అక్కడా దాన్ని పారేయ కూడదు.

పబ్లిక్‌ ప్లేస్‌లో కాకుండా ప్రైవేట్‌గా దాన్ని కాల్చివేయాలి.జాతీయ జెండాను ఎప్పుడూ మట్టిలో పాతి పెట్టకూడదని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube