తెలంగాణ ఎన్నికల్లో అందరి చూపు ఆకర్షించిన నియోజకవర్గాల్లో దుబ్బాక ( Dubbaka ) ఒకటి.ఇక్కడ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలిచి సంచలనం సృష్టించారు.
అయితే ప్రస్తుతం ఇక్కడ త్రిపుఖ పోరు కొనసాగుతోంది.అయితే ఇక్కడ అన్ని రౌండ్లు ముగిస్తేనే ఫలితాలు క్లారిటీగా తెలుస్తాయి.
ఎందుకంటే రౌండ్ రౌండ్ కి మధ్య విభిన్న ఫలితాలు వస్తాయి.అయితే ఈసారి ఇక్కడ బరిలో బిజెపి నుండి రఘునందన్ రావు( Raghunandan rao ) ,బీఆర్ఎస్ నుండి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
అయితే 2009 ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి పై చేయి సాధించారు.
అలాగే 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి పై బిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ( Solipeta ram lingareddy ) పై చేయి సాధించారు.
ఇక రాం లీంగారెడ్డి చనిపోవడంతో మళ్లీ అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి.ఇక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి భార్య సుజాత బరిలో ఉండగా స్వల్ప ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు అక్కడ పై చేయి సాధించారు.
అయితే ఈసారి దుబ్బాకలో కాంగ్రెస్,బిజెపి, బిఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు జరుగుతుంది.దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘు నందన్ రావు నేనే గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే అక్కడ ఎన్నికలకు ముందు కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kotta prabhakar reddy ) పై కత్తిపోటు పెద్ద సంచలనం సృష్టించింది.ఇక ఆయన కత్తిపోటు కు గురవడం వల్ల ఆయనకు సింపతి ఓట్లు పడతాయని బిజెపి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుందని అందరూ భావించారు.బిఆర్ఎస్ లోని ప్రతి ఒక్కరు ఈయన గురించి స్పందిస్తూ కాంగ్రెస్ బిజెపిలే ఈయనపై కత్తిపోటుకు జరగడానికి కారణమయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే సింపతితో కొంతవరకు నెట్టుకు వచ్చినప్పటికీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేది మాత్రం తెలియదు.

ఇక ఈసారి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న రఘునందన్ రావు తో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ( Cheruku srinivas reddy ) కూడా ప్రచారంలో మునిగితేలారు.ఇక వీరందరికీ మంచి క్యాడర్ ఉంది.దాంతో దుబ్బాక సీటు ఎవరికి రాబోతుంది అనే దానిలో ఉత్కంఠ నెలకొంది.మరి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావుకి దెబ్బ పడబోతుందా లేదా అనేది తెలియాలి.
ప్రస్తుతానికి అయితే దుబ్బాక ఓటింగ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.







