కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లా( Karimnagar district )లో ఘోర ప్రమాదం జరిగింది.

సైదాపూర్ మండలం ( Saidapur )బోర్నపల్లిలో అతి వేగంగా మట్టితో వెళ్తున్న టిప్పర్ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ క్రమంలో టిప్పర్ లారీలోని మట్టి పడి బైకుపై వెళ్తున్న ముగ్గురు మృత్యువాతపడ్డారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, మరో అమ్మాయి మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో మట్టికింద ఉన్న మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు