ప్రస్తుతం వేసవికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ గా ఉంటే ప్రమాదంలో పడ్డట్టే.
డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్ వంటి వేసవిలో ప్రధానంగా ఇబ్బంది పెడతాయి.వీటి నుంచి తప్పించుకోవాలంటే డైట్ లో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవాల్సిందే.
చియా సీడ్స్ కూడా ఆ కోవకే చెందుతాయి.వేసవికాలంలో ఇవి ఆరోగ్యానికి కొండంత అండగా నిలబడతాయి.
ఈ నేపథ్యంలోనే చియా సీడ్స్ ను ఈ విధంగా తీసుకోవాలి.? అసలు సమ్మర్ లో చియా సీడ్స్ ( Chia seeds )అందించే ప్రయోజనాలేంటి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చియా సీడ్స్ ను కొబ్బరి నీళ్లలో కలిపి తీసుకోవచ్చు.ఒక గ్లాస్ కోకోనట్ వాటర్( Coconut water ) లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి పది నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై ఈ డ్రింక్ ను ఆస్వాదించండి.
అలాగే ఒక గ్లాస్ చిల్డ్ వాటర్ లో రెండు స్పూన్ల లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ హనీ మరియు వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కలిసి తీసుకోవచ్చు.

గ్రీన్ టీతో పాటుగా కూడా చియా సీడ్స్‌ను తీసుకోవచ్చు.గ్రీన్ టీ తయారు చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఆపై గ్రీన్ టీ( Green tea )లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ హనీ మరియు ఐస్ వేసుకుని తాగేయడమే.
చియా సీడ్స్ ను స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు.వేసవిలో ఈ విత్తనాలను ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరతాయి.ముఖ్యంగా చియా సీడ్స్ కు శరీరంలోని నీటిని గ్రహించి నిలుపుకోగల సామర్థ్యం ఉంది.అందువల్ల వీటిని డైట్ లో చేర్చుకుంటే మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.
డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతాయి.అలాగే చియా సీడ్స్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఒమేగా-3 కొవ్వు యాసిడ్స్, వివిధ రకాల విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి.
ఇవి మీకు రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తాయి.నీరసం, అలసట దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.
అంతేకాకుండా చియా సీడ్స్ బరువు నిర్వహణలో సహాయపడతాయి.ఇవి ఆకలి కోరికలను తగ్గించడమే కాకుండా మెటబాలిజం రేటును పెంచుతాయి.
ఫలితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు.