"ఆ ముగ్గురిది ఒకే ఊరు" కానీ దారులు వేరే వారెవరో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఓకే రంగంలో రాణిస్తుంటారు.అలా రాణించటానికి వెనుక వాళ్ళు పడుతున్న కష్టం కూడా అలానే ఉంటుంది.

అయితే ప్రతి ఒక్కరికీ తాము ప్రారంభించిన పనిలో సక్సెస్ అవ్వాలని ఉంటుంది.దానికోసం వారికీ చదువు, హోదా , సంపద, వారసత్వం, అలాగే సపోర్ట్ , ఇలా ఎన్ని ఉన్నా కూడా వారికి కొంచెం కర్మ ఫలం అలాగే అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది.

అప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్న పనిలో రాణించగలుగుతారు అని చెప్పటానికి ఉదాహరణగా మనము ఇప్పుడు ఒక కథను తెలుసుకుందాము.అయితే ఈ కథ ఇప్పటికే సోషల్ మీడియాలలోను అనేక వార్తా పత్రికలలోనూ బాగా వైరల్ అవుతుంది అని చేప్పవచ్చు.

అంతే కాదు డెస్టినీ అంటే ఎలా ఉంటుందో అని చెప్పటాని కూడా ఈ కథను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.ఇక కథలోకి వెళితే, ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లవాళ్ళు స్నేహితులుగా ఉండేవారు.

Advertisement

అయితే వారిలో మొదటి వాడి పేరు శ్రీధరన్ , రెండవ వాడి పేరు శేషన్ , అలాగే మూడవ వాడి పేరు ఉన్ని కృష్ణన్. అయితే ఈ ముగ్గురి సోషల్ బ్యాక్ గ్రౌండ్ అలాగే వాళ్ళు చదివిన స్కూల్స్ కానివండి సేమ్.

అయితే అందులో మొదటి వాడైన శ్రీధరన్ స్కూల్ చదువు పూర్తి అయిన తరువాత కాకినాడ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివి రైల్వే ఇంజనీర్ అయ్యాడు.ఈయన ఇంజనీర్ పనులలో మంచి ప్రసిద్ధి.

ఇక రెండవాడు శేషన్ స్కూల్ చదువు తరువాత సివిల్ సర్వీసు లో చేరి రిటైర్ అయ్యాక చీఫ్ ఎన్నికల కమిషనర్ గా రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించాడు.

తనతో పోటీపడే శ్రీధరన్ పనిచేసే రైల్వే శాఖకు హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాడు.మూడవాడు ఉన్ని కృష్ణన్ మాత్రం చదువువును అంతగా పట్టించుకోకుండా రాజకీయాలలో చేరి సరైన పార్టీలో చేరి వరుసగా గెలిచేవాడు.ఒకసారి మంత్రిగా చేసి తమ ఇద్దరు ఫ్రెండ్స్ పని చేస్తున్న శాఖకే మంత్రి అయ్యాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సేమ్ మార్క్స్ సాధించిన ట్విన్ బ్రదర్స్.. గ్రేట్ అంటూ?

అది డెస్టినీ.ఇదే పదే పదే చెప్తున్న కథ .అంతేకాదు చదవగల స్టోరీ కూడా బాగుంటుంది కానీ.?

Advertisement

అయితే ఇందులో శ్రీధరన్, శేషన్ ఒకే బడిలో చదివారు అన్నది మాత్రమే నిజం.అలాగే ఒకే క్లాస్ ఇద్దరు పోటీ పడ్డారు అన్నది కూడా నిజం.కానీ ఉన్నికృష్ణన్ వీళ్ళతో కలిసి చదివాడు అన్నది మాత్రం అబద్దం.

అయితే మొదటి ఇద్దరు చదివింది కేరళలోని పాలక్కాడ్ లో గల బీఈఎం స్కూల్ లో, మరియు వీరిద్దరికి పదవ తరగతిలో వచ్చిన మార్కులతో ఇద్దరి మద్య కేవలం ఒకే ఒక్క మార్క్ అంతే, అంటే శేషన్ యావరేజ్ స్టూడెంట్ కాదు.అలాగే ఉన్నికృష్ణన్ ది కోజిక్కోడ్.

కాకపోతే శేషన్ అలాగే ఉన్ని కృష్ణన్ ఇద్దరు చెన్నై లోని ఏంసీసీ కాలేజ్ లో చదివారు.ఉన్ని కృష్ణ్ణ కూడా చదువులో మందమతి కాదు.

అలాగే శ్రీధరన్ పనిచేసిన రైల్వేకు శేషన్ ఎప్పుడూ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా చేయలేదు.1989-90 నాటికే శేషన్ కాబినెట్ సెక్రటరీ అయ్యాడు.కొన్నాళ్ల తరవాత ప్లానింగ్ కమిషన్ ఆ తరువాత చీప్ ఎలక్షన్ కమిషనర్ అయ్యాడు.

ఉన్ని కృష్ణన్ మంత్రి గా ఉన్న కాలంలో ఆయన అధికార పరిధిలో శేషన్ లేడు.అలాగే శ్రీధరన్ ఉన్న రైల్వే బోర్డు మీద మాత్రం కొంత కాలం ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు.

ఇలా ఈ స్టోరీ ఒక కల్పన మాత్రమే.ఇందులో శ్రీధరన్, శేషన్ లు మాత్రమే క్లాస్మేట్స్ అన్నది ఒక్కటే నిజం.అలాగే ఉన్ని కృష్ణన్ మొదటి నుండి రాజకీయాల్లో ఉన్న వాడే, ఇక కెరీర్ ఉచ్ఛదశల్ని అనుభవించి, వయస్సు మళ్లాక రాజకీయాల్లోకి వచ్చారు శ్రీధరన్ అలాగే శేషన్ .శేషన్ ఏకంగా రాష్ట్ర పతి పదివికి పోటీ చేయగా శ్రీధరన్ మాత్రం కేరళ ఎన్నికల్లో పోటీ చేసి సహజంగానే భంగపడ్డారు.

తాజా వార్తలు