నర్సీపట్నం విశాఖ రోడ్డు మార్గంలో మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బారాయుడు పాలెం రాయల్ రిసార్ట్స్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాళ్లపాలెం నుంచి వస్తున్న కారు రాయల్ రిసార్ట్స్ వద్ద భారీ చెట్టుని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.కారు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుత సమాచారం ప్రకారం మాకవరపాలెం మండలం మాకవరపాలెం గ్రామం తామరం గ్రామానికి చెందిన ఐదుగురు వీరంతా గత రాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని లో ఒక వివాహానికి హాజరయ్యారు.
ఈ రోజు తెల్లవారుజామున తిరిగివస్తుండగా సుమారు 5 గంటల ప్రాంతంలో నర్సీపట్నం టౌన్ లిమిట్స్ లోని సుబ్బారాయుడు పాలెం గ్రామం సమీపిస్తుండగా ఒక చింత చెట్టుని కారు బలంగా ఢీ కొట్టి నట్టు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో మాకవరపాలెం, తామరం నికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రగాయాలైన మరో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం పంపించారు.పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.