ముగ్గురు యువతులు కదులుతున్న రైలు నుంచి ఒకరి తర్వాత ఒకరు దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తమ ప్రాణాలను పణంగా పెట్టి కదులుతున్న రైలు నుంచి ఆ యువతులు దూకుతున్న ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి షేర్ చేశారు.
ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ ఘటన మహారాష్ట్రలోని జోగేశ్వరి రైల్వే స్టేషన్‌లో జరిగిందని ఐపీఎస్ కైజర్ ఖలీద్ తెలిపారు.
లోకల్ ట్రైన్ ఎక్కిన ఓ అమ్మాయి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్లాట్‌ఫారమ్‌పై పడింది.అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకముందే హోంగార్డు ఆ యువతిని రక్షించాడు.
ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.IPS షేర్ చేసిన వీడియోలో స్టేషన్ నుండి లోకల్ రైలు ఎలా బయలుదేరుతుందో చూడవచ్చు.
అయితే రైలు కాస్త వేగం పెరగడంతో ఓ యువతి రైలు నుంచి దూకింది. ఆమె బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ అంచున పడిపోయింది.అప్పుడే ఒక గార్డు ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తి ఆమె రైలు కింద పడకుండా కాపాడాడు.ఇంతలో మరో ఇద్దరు యువతులు కూడా కదులుతున్న రైలు నుంచి దూకడం కనిపించింది.
ఆ యువతులను కాపాడిన గార్డును జీఆర్పీ జవాన్ అల్తాఫ్ షేక్‌గా గుర్తించారు.

అల్తాఫ్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.ఐపీఎస్ కైజర్ ఖలీద్ తన ట్వీట్‌లో ఇలా రాశారు.ఏప్రిల్ 16న జోగేశ్వరి స్టేషన్‌లో సబర్బన్ రైలు ఎక్కుతుండగా పడిపోయిన యువతులను హోమ్ గార్డ్ అల్తాఫ్ షేక్ రక్షించారు.
అల్తాఫ్ చురుకుదనం, విధి నిర్వహణకు తగిన ప్రతిఫలాన్ని అందజేస్తున్నామని తెలిపారు.







