పార్టీలో పని చేయని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు.ఈ విషయంలో తనకు కూడా మినహాయింపు లేదని చెప్పారు.
పని చేయని ఇంఛార్జ్ లకు టికెట్లు దక్కవన్న నారా లోకేశ్ పార్టీ తరపున స్వచ్ఛంద సేవ చేస్తామంటే ఎవరినైనా ప్రోత్సహిస్తామని తెలిపారు.నేను చేయను.
ఇతరులెవరూ చేయకూడదనే తత్వం సరికాదన్నారు.సేవా కార్యక్రమాలు చేసే వారు ఇంఛార్జ్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.
కానీ ఇంఛార్జ్ చెప్పిన విధంగానే అన్నీ జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు.స్వార్థంతో పార్టీని వీడిన వారు ఇప్పుడు వస్తామన్నా చేర్చుకోనేది లేదని తేల్చి చెప్పారు.
వారి స్థానంలో కొత్త తరం నాయకులను తయారు చేసుకుంటామని తెలిపారు.రాయలసీమలో పాదయాత్ర పూర్తి అయ్యే నాటికి ఆ ప్రాంత అభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
అదేవిధంగా మహానాడు వేదికగా రేపు యువతకు శుభవార్త చెప్తామని లోకేశ్ వెల్లడించారు.