Bigg Boss Show : బిగ్ బాస్ 7 నుండి క్రేజీ అప్డేట్.. ఈసారి మామూలుగా ఉండదుగా?

టాలీవుడ్( Tollywood ) బుల్లితెరపై రియాలిటీ షో గా ప్రసారమైన బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసుకుందో చూసాం.మొదటి సీజన్ నుండి ఆరవ సీజన్ వరకు ఈ షో రేటింగ్ విషయంలో అస్సలు తగ్గలేదని చెప్పాలి.

 Crazy Update From Bigg Boss 7 Not Normal This Time-TeluguStop.com

ఇక ఇందులో నటీనటులు, బుల్లితెర ఆర్టిస్టులు, సోషల్ మీడియా సెలబ్రెటీలు, న్యూస్ యాంకర్లు పాల్గొని బాగా సందడి చేశారు.ప్రతి సీజన్ లు రఫ్ గా, బోల్డ్ గా సాగాయి.

అయితే ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్లకు అందరికీ గుర్తింపు ఒకేలా వస్తుంది అనుకోవడం పొరపాటు.నిజానికి ఈ షో ద్వారా మంచి ఫామ్ లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పాలి.

ఇక మిగతా వాళ్ళంతా ఎక్కడికెళ్లారో కూడా అసలు వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తున్నారా లేదా అనే విషయాలు కూడా తెలియట్లేదు.

Telugu Bigg Boss Show, Nagarjuna, Rana, Tollywood-Movie

ముఖ్యంగా టైటిల్ విన్నర్( Title winner ) అందుకున్న వాళ్లలో కొందరి జాడ కూడా లేదని చెప్పాలి.ఇక మరి కొంతమంది మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక ఈ షోకు మొదట్లో ఎన్టీఆర్, నాని హోస్ట్ గా చేయగా ఇక మిగతా సీజన్లు మొత్తం నాగర్జుననే నడిపించాడు.

అయితే ఇదంతా పక్కన పెడితే త్వరలో సీజన్ 7 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇంతకాలం హోస్ట్ చేసిన నాగార్జున కూడా ఈసారి ఈ సీజన్ నుండి తప్పుకున్నట్లు తెలిసింది.

అయితే గత కొంతకాలం నుంచి మాత్రం రానా హోస్ట్( Rana ) గా చేయనున్నాడు అని వార్తలైతే వస్తున్నాయి.ఒకవేళ నాగార్జున తప్పుకుంటే మాత్రం రానానే రావడం గ్యారెంటీ అని అర్థమవుతుంది.

Telugu Bigg Boss Show, Nagarjuna, Rana, Tollywood-Movie

ముఖ్యంగా ఈ సీజన్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతాయని తెలుస్తుంది.అదేంటంటే.అప్పటిలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను వెంటనే హౌస్ నుంచి బయటికు పంపించకుండా మరో ప్లాన్ చేశారని.అంటే వారితో కూడా సరికొత్త గేమ్ ప్లాన్( new game plan ) చేశారని తెలుస్తుంది.

ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా హై రేంజ్ లో అందించాలని అనుకుంటున్నట్లు తెలిసింది.ఇక ఈసారి చిన్నచిన్న ఆర్టిస్టులను కాకుండా బాగా పాపులారిటీ సంపాదించుకున్న నటీనటులను ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

మరీ ముఖ్యంగా ఒక సీక్రెట్ రూమ్ లో విడాకులు తీసుకున్న జంటను ఉంచబోతున్నారని టాక్ నడుస్తుంది.నిజానికి ఇటువంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంటే మాత్రం జనాలు విడాకులు తీసుకున్న జంట కోసమైనా షో చూడటం ఖాయమని చెప్పాలి.

Telugu Bigg Boss Show, Nagarjuna, Rana, Tollywood-Movie

ఇక ఇదే నిజమైతే ఆ జంట కలిసే సందర్భాలు కూడా ఎక్కువగా ఉంటాయి.కొంతవరకు బిగ్ బాస్ విడాకులు తీసుకున్న జంటకు( divorced couple ) న్యాయం చేసేలా చూస్తున్నాడని అర్థమవుతుంది.ఇక సీజన్ 7 గురించి ఎప్పటి నుంచో కొన్ని వార్తలు వైరల్ కాగా.ఇందులో యాంకర్స్ ఉదయభాను, సుడిగాలి సుధీర్, రష్మీ పాల్గొననున్నట్లు తెలుస్తుంది.ఇక విడాకులు తీసుకున్న జంట అంటే ఎవరా అనేది సస్పెన్స్ గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube