సాధారణంగా రాజకీయ పార్టీ అంటేనే వర్గపోరు అనేది చాలా కామన్.ఇది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో ఉన్న మంత్రుల వరకు కూడా కనిపిస్తుంది.
అయితే ఇది ఒక్కో పార్టీలో ఒక్కో రకంగా ఉంటుంది.ఓ పార్టీలో ఎక్కువగా కనిపిస్తే ఇంకో పార్టీలో ఉన్నా కూడా పెద్దగా బయటకు రాదు.
ఇదే విషయం ఏపీలోని వైసీపీకి కూడా బాగానే వర్తిస్తుంది.ఆ పార్టీలో మొదటి నుంచి వర్గ విబేధాలు ఉన్నా పెద్దగా బయటకు రాలేదు.
అయితే ఈ నడుమ మాత్రం బాగానే కనిపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా రాజమండ్రీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్టు రాజకీయాలు నడుస్తున్నాయి.
ఎంపీ మార్గాని భరత్ కు అలాగే ఎమ్మెల్యే రాజా కు ఎప్పటి నుంచో వర్గ విభేదాలు నడుస్తున్నాయి.ఇరువురి ప్రవర్తన మీద ఇది వరకే జగన్ క్లాస్ కూడా తీసుకున్నట్టు ప్రచారం ఉంది.
ఇద్దరి వల్ల పార్టీకి ఎలాంటి పేరు రావొద్దని పార్టీ పెద్దలు కూడా సూచించారంట.అయినా సరే ఇద్దరిలో ఎవరూ తగ్గట్లేదు.
జక్కంపూడి రాజా తండ్రి రామ్మోహనరావు హయాం నుంచే జగన్‌కు అండగా ఉంటున్నారు.అందుకే తనదే పూర్తి హవా ఉండాలని రాజా భావిస్తున్నారు.
ఇంకోవైపు భరత్ కూడా బీసీ సంఘాల అండ ఉన్నందున తన ఆధిక్యమే చెల్లుబాటు కావాలని పట్టుబడుతున్నారు.

అటు రాజా కాపు వర్గం నుంచి ఇటు భరత్ బీసీ వర్గం నుంచి ఉండటంతో ఇరువురి మధ్య సయోధ్య కుదరట్లేదు.ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇక ఈ ఇద్దరితో పడలేని వైసీపీ నేతలు శివ రామసుబ్రమణ్యం, రుడా ఛైర్ పర్సన్ షర్మిలా రెడ్డితో పాటు శ్రీనివాస్ లాంటి బలమైన నేతలు అందరూ తమ వర్గాలను పెంచుకుంటున్నారు.
ఎవరికి వారే వర్గాలను పెంచేసుకుని ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.దీంతో వైసీపీ ముక్కలవుతోంది.ఇది కొనసాగితే గనక రాబోయే కాలంలో ఇక్కడ టీడీపీ లాగే వర్గాలుగా పార్టీ విడిపోవడం ఖాయం.