ఆ న్యూడ్ ఫోటోలు నావి కాదు.. పోలీసులకు జలక్ ఇచ్చిన రణవీర్!

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ గత కొద్దిరోజుల నుంచి న్యూడ్ ఫోటో వివాదంతో తరచూ వార్తలలో నిలుస్తున్నారు.ఈయన ప్రముఖ మ్యాగజైన్ కోసం ఒంటి పై నూలు పోగు లేకుండా ఫోటోషూట్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురయ్యాయి.

 Those Nude Photos Are Not Mine Ranveer Gave Jalak To The Police Nude Photos , R-TeluguStop.com

ఇక ఈ న్యూడ్ ఫోటోలు పై ఎంతోమంది ఎన్నో అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఈయన మాత్రం తన ధోరణి మార్చుకోకుండా తాను కొన్ని వేల మంది సమక్షంలో కూడా బట్టలు లేకుండా రాగలనంటూ ఛాలెంజ్ చేశారు.

ఇలా రణవీర్ న్యూడ్ ఫోటోల పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతోమంది ఈయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈయనపై పోలీసు కేసు నమోదు చేశారు.

ఇకపోతే కేసు నమోదు చేసుకున్న చెంబూరు పోలీసులు ఈయనను న్యూడ్ ఫోటో విషయంపై విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోల వివాదంపై విచారణకు హాజరైన రణవీర్ పోలీసుల ఎదుట చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.

Telugu Bollywood, Mumbai, Ranveer-Movie

ఇలా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయించుకోవడంతో ఎంతోమంది ఈయనని అనుసరించి ఇదే ధోరణిలో న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తూ మహిళల మనోభావాలను దెబ్బతీయటంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేశారు.ఇకపోతే పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఈ హీరో ఒకేసారి న్యూడ్ ఫోటోలు తనవి కాదంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తనని ఇరికించారంటూ ఈయన సమాధానం చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.ఇలా ముంబై పోలీసులకు రణవీర్ ఇచ్చిన వాంగ్మూలంలో ఈయన ఇలా పేర్కొనడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube