ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.ఈ నెలలో విడుదలైన సినిమాలు ( Movies ) ప్రేక్షకులకు భారీ షాకిచ్చాయనే సంగతి తెలిసిందే.
ఈ వారం విడుదలవుతున్న సినిమాల విషయానికి వస్తే విరూపాక్ష సినిమాపై( Virupaksha ) భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.హర్రర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఈ వారం విడుదలవుతున్న మరో మూవీ హలో మీరా( Hello Meera ) కాగా సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా సింగిల్ రోల్ తో ఈ సినిమా తెరకెక్కింది.ఈ రెండు సినిమాలు 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఓటీటీల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 18న హౌ టు గెట్ రిచ్ స్ట్రీమింగ్ కానుంది.
చింప్ ఎంపైర్ డాక్యుమెంటరీ ఏప్రిల్ 19వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంది. ది మార్క్ డ్ హార్ట్ సీజన్ 2 19వ తేదీన స్ట్రీమింగ్ కానుండగా ఛోటా భీమ్ ఏప్రిల్ 20వ తేదీన, టూత్ పరి, డిపో మ్యాట్ ఏప్రిల్ 20వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి.

ఏప్రిల్ 21వ తేదీన డిప్లొమ్యాట్, సత్య2, రెడీ, ఇండియన్ మ్యాచ్ మేకింగ్, ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది.సోనీలివ్ లో గర్మీ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో
సుగా
పేరుతో స్పెషల్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.ఇతర ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు తెలియాల్సి ఉంది.

విరూపాక్ష సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాతో సక్సెస్ సాధించడం సాయితేజ్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ నటించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.







