మీలో దాదాపుగా చాలామంది వోల్వో బస్సులో ప్రయాణం సుదూర ప్రయాణాలు చేసే వుంటారు.ఇవి సాధారణ బస్సులు కాకుండా కాస్త సౌకర్యంగా ఉంటాయి.
దాంతో వీటిలో ప్రయాణించాలంటే ఛార్జ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఇపుడు చెప్పుకోబోయే వోల్వో బస్సు అంతకు మించి ఉంటుంది అనడంలో సందేహమే లేదు.
అవును, స్వీడీష్ లగ్జరీ ఆటో బ్రాండ్ సంస్థ ఆటో ఎక్స్ పో 2023లో ఆన్ బోర్డ్ టాయిలెట్, సోఫా టైప్ రిక్లయినర్ సీట్లతో ఓ లగ్జరీ బస్సును ప్రదర్శించింది.ఈ వోల్వో 9600 మోడల్ విలాసవంతమైన ప్రయాణ అనుభవం కోసమే తయారు చేయబడింది.

డబుల్ డెక్కర్ స్లీపర్ సీట్లు, 13.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, ఎత్తును కలిగి వున్నాయి.అలాగే బ్రాండ్ ఎక్స్ టెర్ తో విలక్షణమైన వి-ఆకారపు హెడ్ లైట్ లను కలిగి ఉంది.హైడ్రాలిక్ పవర్ అసిస్టెంట్ స్టీరింగ్, హీటెడ్, ఎలక్ట్రికల్ తో పనిచేసే త్రీ-పీస్ రియర్ వ్యూ మిర్రర్ కలిగి ఉంది ఈ బస్.అద్భుతమైన సౌకర్యం, తక్కువ శబ్దంతో నడుస్తుంది.స్లీపర్ కోచ్, సీటర్ వేరియంట్స్ అందుబాటులో కలవు.
అంతేకాకుండా ఆన్ బోర్డ్ టాయిలెట్, సౌకర్యవంతమైన సీటింగ్, పనోరమిక్ విండోస్, గ్రేడియంట్ థియేటర్ ఫ్లోర్ ను కలిగి ఉంటుంది.

డ్రైవర్ కూర్చున్నచోట క్యాబిన్ డిజైన్ క్లీన్ లే అవుట్ ను కలిగి వుంది.ఎర్గోనామిక్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కోసం డ్రైవర్ చుట్టూ కాస్త వంకరగా ఉంటుంది.ఈ డిజైన్ ప్రైవేట్ జెట్ లకు మించి ఉందని చూసిన కొందరు ప్రయాణికులు తెగ పొగిడేస్తున్నారు.
కాగా ఈ బస్సులు మరిన్ని వస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.ఇకపోతే ఈ ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించబడిన వోల్వో కోచ్ వివిధ రౌండ్ల జీ 20 సమావేశాల కోసం భారతదేశానికి వచ్చే ప్రతినిధులను రవాణా చేయడానికి ఉద్దేశించబడి తయారుచేయబడినది.







