76 ఏళ్ల క్రితం నాటి పాక్ టు ఇండియా ట్రైన్ టికెట్ వైరల్..

పాతకాలంనాటి వస్తువైనా లేదా ఏదైనా కాగితం ముక్కైనా దానికి ఈరోజుల్లో చాలా విలువ ఉంటుందని చెప్పవచ్చు.అప్పటి కాలం ఎలా ఉండేది, అప్పటి మనుషులు ఎలా బతికేవారు వంటి వివరాలను తెలిపే ఈ పాత కాలం నాటి వస్తువులు, కాగితాలు, బిల్లులను ప్రజలు అపురూపంగా చూసుకుంటారు.

 Pakistan To India, Rawalpindi And Amritsar, Old Train Ticket , 1947 Train Ticket-TeluguStop.com

కాగా తాజాగా 76 ఏళ్ల క్రితం నాటి ఒక ట్రైన్ టికెట్ వైరల్‌గా మారింది.స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వెళ్లేందుకు అప్పటి ప్రజలు తీసుకున్న ఈ పాత టికెట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం రావల్పిండి నుంచి అమృత్‌సర్ మధ్య 1947లో తొమ్మిది మందికి టిక్కెట్టు ధర 36 రూపాయల 9 అణాలు మాత్రమే.ఈ టిక్కెట్టు ఫొటోను ‘పాక్ రైల్ లవర్స్’ అనే ఫేస్‌బుక్ పేజీ పోస్ట్ చేసింది.ఆ పోస్ట్‌లో టికెట్ డేట్‌ను 17-09-1947గా, టికెట్ ధరను 36 రూపాయలు & 9 అణాలుగా రాశారు.అలాగే ఒక కుటుంబం పాక్ నుంచి భారతదేశానికి వలస వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఈ పోస్ట్ వెంటనే చాలా మంది దృష్టిని ఆకర్షించింది.ఈ ఓల్డ్ మెమరీని ఇలా కాగితంలా ఉంచే కంటే ల్యామినేట్ చేసి దానిని ప్రదర్శనలో పెట్టడం మంచిది అని ఇంకొకరు కామెంట్ చేశారు.75 ఏళ్లు ఉంచినా ఈ బిల్లు కొన్ని రోజుల క్రితం కొన్నట్లే ఉంది.ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇంకొకరు కామెంట్ చేశారు.” 76 ఏళ్ల క్రితం 36 రూపాయలు, 9 అణాలు అంటే చాలా పెద్ద అమౌంట్.” అని ఒక ఫేస్‌బుక్ యూజర్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube