ఈసారి భీమవరంలో పవన్ 60 వేల మెజార్టీతో గెలుస్తారు వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఫస్ట్ టైం పోటీ చేయడం తెలిసిందే.భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలు కావటం జరిగింది.

 This Time Pawan Will Win In Bhimavaram With A Majority Of 60 Thousand Ycp Mp's S-TeluguStop.com

ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఓటమి చెందటం అప్పట్లో సంచలనంగా మారింది.పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం లో ఓటమి చెందటం అందరికీ నిరాశను కలిగించింది.

ఇదిలా ఉంటే ఈసారి మాత్రం భీమవరం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ 60 వేల మెజార్టీతో గెలుస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ( Raghu Rama Krishnam Raju )జోష్యం చెప్పారు.అంతేకాదు భీమవరం ప్రజలు గతంలో మంచి మనిషిని ఓడించిన బాధల్లో ఉన్నారని తెలిపారు.

పవన్ వారాహి( Varahi ) యాత్రతో వైసీపీ నాయకులలో భయం పట్టుకుందని అన్నారు.ఏది ఏమైనా పవన్ మళ్లీ భీమవరం నుండి మళ్లీ పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే జూన్ 14 నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.ఉభయగోదావరి జిల్లాలలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యాత్ర మొదలుకానుంది.ముందుగా తూర్పుగోదావరి తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలలో పవన్ యాత్ర కొనసాగించనున్నారు.ఒక్కో నియోజకవర్గంలో దాదాపు రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో భీమవరం నియోజకవర్గంలో ఈసారి పోటీ చేస్తే పవన్ 60 వేల మెజార్టీతో గెలుస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్లు చేయటం సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube