మనకు తెలియదు గానీ ఈ ప్రపంచంలో చాలా రకాల హోటళ్లు, రెస్టారెంట్లు ఉంటాయి.మన దేశంలో తక్కువ గానీ ఇతర దేశాల్లో మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల వెరైటీ హోటళ్లు ఉంటాయి.
వీటన్నింటి గురించి ఇంతకు ముందు మనకు తెలియదు గానీ.సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం వీటి గురించి బాగా వార్తలు వినిపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్లో నీటిని పోసి చేపలను పెంచుతున్నారు.ఆ నీటిలోనే కస్టమర్లు భోజనం చేయడం కూడా మనం చూస్తున్నాం.
కాగా ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి బాగా పాపులర్ అవుతోంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి పింక్ షుగర్ ఎస్‌ప్రెస్సో గురించి మనం తెలుసుకుందాం.
ఇది ఓ కేఫ్.అక్కడ చాలా ఫేమస్.
అయితే రుచి పరంగానో లేదంటే తమ ప్రాడక్టు పరంగానే ఫేమస్ కాలేదండోయ్.ఇందులో సర్వింగ్ విధానం వల్లే ఇంత ఫేమస్ అయిపోయింది.
దీని గురించి ఇప్పుడు ఎవరో ఒకరు పోస్టులు పెడుతూనే ఉన్నారు.రొటీన్ గా ఉంటే ఏం లాభం అనుకున్నారో ఏమో గానీ.
ఈ కేఫ్ లో బికినీలో సర్వ్ చేస్తుంటారంట ఇక్కడి సిబ్బంది.వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే నిజమండి బాబు.
ఇందులో వెయిట్రెస్‌లు బికినీల్లోనే కాఫీని సర్వింగ్ చేస్తారంట.అందుకే దీన్ని బికినీ కేఫ్ అని కూడా పిలుస్తున్నారు.అయతే ఇందులోకి వచ్చిన కస్టమర్లు ఆర్డర్ ఇస్తే దాన్ని తీసుకునేందుకు కూడా బికినీలోనే వస్తారు.ఇక బిల్లు తీసుకోవడం కూడా ఇలా బికనీలోనే చేస్తారు ఇక్కడి వెయిట్రెస్.
అయితే ఇందుకోసం వారంతా కూడా మేకప్ వేసుకుంటారంట.చాలా అందంగా కనిపించేందుకు ఇలా చేస్తారంట.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నవ్వుతూనే పలకరిస్తారంట.కాగా ఈ కేఫ్ లో జీతాలు చాలా ఎక్కువగా ఇస్తారంట.
రెండు నెలలు పనిచేస్తే ఇల్లు కూడా కొనుక్కోవచ్చు.