యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత సక్సెస్ సాధించి సత్తా చాటేలా తారక్ ప్లాన్స్ ఉన్నాయి.
ఇప్పటికే తారక్ వార్ 2( War 2 ) షూటింగ్ లో పాల్గొని ఒక షెడ్యూల్ ను ముగించారు.తారక్ హిందీ భాషలో అనర్ఘళంగా మాట్లాడ్గలరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా ఒక బాలీవుడ్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొని సందడి చేశారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు పార్టీలు చేసుకోవడం కొత్తేం కాదు.
బాలీవుడ్ స్టార్స్ తో జరిగిన డిన్నర్ పార్టీలో తారక్ తన ఫ్యామిలీతో కలిసి పాల్గొనడం జరిగింది.అలియాభట్,( Alia Bhatt ) రణబీర్ కపూర్,( Ranbir Kapoor ) కరణ్ జోహార్ ఈ పార్టీలో పాల్గొన్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్న తీరుకు ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.రెండు వారాల్లోనే తారక్ కు అక్కడ ఇంత క్రేజా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలలో నటిస్తే ఆయన స్థాయి మరింత పెరగడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) తారక్ కు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాకవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతవుతోంది.భవిష్యత్తులో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏడాదికి ఒక సినిమాతో మరికొన్ని సంవత్సరాలలో అంచనాలకు మించి కెరీర్ పరంగా ఎదిగి ఫ్యాన్స్ కోరుకునే స్థాయికి చేరుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.
తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.








