జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మొదటి 3 రోజులు ఇలాంటి ఫ్లాప్‌ అని ఎందుకు అన్నారు ?

మెగాస్టార్ చిరంజీవి సినిమా జీవితంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాది( Jagadeka Veerudu Atiloka Sundari ) చాలా ప్రత్యేకమైన స్థానం.ఆ సినిమా పేరు వినగానే మనకి చిరంజీవితో పాటుగా ప్రధమంగా దర్శకుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఇళయరాజా, హీరోయిన్ శ్రీదేవి పేర్లు గుర్తుకు వస్తాయి.

 Why This Big Hit Movie Initial Talk Is Flop ,megastar Chiranjeevi , Jagadeka Vee-TeluguStop.com

వీరందరూ కలిసి ఆ సినిమాతో ఒక అద్భుతాన్ని సృష్టించారు.అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు అటువంటి అనుభూతి మునిపెన్నడూ కలగలేదు.

ఇక సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే ఎంతో డెడికేషన్‌, పట్టుదల, అన్నింటినీ మించి సమిష్టి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది.ఆ సినిమా అది నిరూపించింది.

కాగా ఆ సినిమా రిలీజై 34 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకి వన్నె తగ్గలేదు అంటే అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఈ సినిమాలో ఎత్తుకున్న పాయింట్ అలాంటిది మరి.ఎన్ని జనరేషన్లు మారినా, ఎవర్‌గ్రీన్‌ చిత్రంగా నిలిచిందంటే దానికి కారణం అందులోని నిత్యనూతనంగా ఉండే కథావస్తువు.ఇంకేముంది కట్ చేస్తే అప్పట్లో రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.13 కోట్లు కలెక్ట్‌ చేసి అందరినీ అబ్బురపరిచింది.ఇది అప్పటికి ఇండస్ట్రీ రికార్డు అని మీకు తెలుసా.

Telugu Ashwinidat, Raghavendra Rao, Ilayaraja, Jagadekaveerudu, Chiranjeevi, Vyj

అయితే అంత సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా విడుదలైన రెండు మూడు రోజులు అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుందని చాలా మందికి తెలియదు.అప్పటి జనరేషన్ వాళ్ళని అడిగితే చెబుతారు.వైజయంతి మూవీస్‌ బేనర్‌పై ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ నిర్మించిన సి.

అశ్వినీదత్‌కి( C.Ashwinidat ) ఇలాంటి ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేయాలని ఉండేది.ఎప్పటికైనా తన బేనర్‌లో చిరంజీవితో ఓ ఫాంటసీ చిత్రం తీయాలని అనుకునేవారు.ఆ సమయంలోనే రాఘవేంద్రరావును, రచయిత శ్రీనివాస చక్రవర్తిని తిరుపతి పంపించారు.అలా తిరుమలలో ఉండగానే తనకు తట్టిన ఒక లైన్‌ను రాఘవేంద్రరావుకి చెప్పారు శ్రీనివాస్‌.“ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన దేవకన్య అనుకోకుండా హీరోను కలుస్తుంది.ఆ సమయంలో ఆమె వేలికున్న ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది.అది చిరంజీవికి దొరుకుతుంది!” ఇదీ లైన్‌.ఈ లైన్‌ రాఘవేంద్రరావుకి, అశ్వినీదత్‌కి, చిరంజీవికి పిచ్చి పిచ్చిగా నచ్చింది.

Telugu Ashwinidat, Raghavendra Rao, Ilayaraja, Jagadekaveerudu, Chiranjeevi, Vyj

దాంతో ఈ లైన్ మీద యండమూరి వీరేంద్రనాథ్‌, జంధ్యాల, సత్యమూర్తి, క్రేజీ మోహన్‌, విజయేంద్రప్రసాద్‌, శ్రీనివాస చక్రవర్తి ఈ కథ మీద నెల రోజులపాటు కూర్చొని చర్చించి కథను ఓ కొలిక్కి తెచ్చారు.మొదట ఈ సినిమాకి అనుకున్న టైటిల్‌ ‘భూలోక వీరుడు’.ఆ తర్వాత ‘జగదేక వీరుడు’ అనుకున్నారు.

ఇందులో దేవకన్య పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ‘అతిలోక సుందరి’ అని చేర్చడం జరిగింది.ఈ జగదేకవీరుడికి అతిలోక సుందరిగా నటించేదెవరు? అని మధిస్తే శ్రీదేవి మదిలో మెదిలింది అలా ఒక క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube