యావత్ IPL హిస్టరీలోనే కోట్లకొలది డబ్బుని కొల్లగొట్టిన ప్లేయర్ ఇతడే!

IPL 16వ సీజన్ మినీ వేలం తాజాగా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.

IPLలో పాల్గొంటున్న మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈ మినీ వేలాన్ని బాగానే వినియోగించుకున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ మినివేలం తర్వాత దాదాపుగా అన్ని జట్లకు న్యాయం జరిగిందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.కానీ అందరూ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించే ఎక్కువగా సోషల్ మీడియాలో చేర్చుకోవడం మనం గమనించవచ్చు.

దీనికి కారణం ఒకటుంది, అది హ్యారి బ్రూక్.ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ జట్టులో చెలరేగి ఆడుతున్న ఆటగాడు ఇతడు.T20 మరియు హండ్రెడ్ లాంటి టోర్నీల వలన వెలుగులోకి వచ్చిన ఈ యువ కెరటం తన అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ సెలెక్టర్లను మెప్పించి జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసినదే.అంతేకాకుండా ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన 3 టెస్ట్ ల సిరీస్ లోనూ 3 సెంచరీలు సాధించి రికార్డ్ సృష్టించాడు.

దాంతో IPL మినీ వేలానికి ముందు ఇతనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.క్రీజులో ఉన్నంతసేపు బౌలర్ ఎంతటివాడైనా దుమ్ములేపడం ఇతని ప్రత్యేకత.అందుకే ఫ్రాంచైజీ కోచ్ లు ఇతనిని దక్కించుకోవడానికి పెద్దమొత్తంలో ముట్టజెప్పడానికి సిద్ధమయ్యారు.

Advertisement

అయితే చివరికి హ్యారి బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీగా ముట్టజెప్పి కొనుగోలు చేసింది.ఇతని కనీస ధర కోటితో స్టార్ట్ కాగా 13 కోట్ల 25 లక్షల వద్ద వేలం ముగిసి అందరినీ ఆశ్చర్యపరిచింది.SRH యజమాని కావ్య మారన్ ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించి ఇతనిని కొనుగోలు చేసింది.

అయితే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్ధుడైన బ్రూక్ ను సన్ రైజర్స్ ఏ విధంగా వాడుకుంటుంది అన్నది మాత్రం కాలం చెబుతుంది.ఎందుకంటే దానిపైనే జట్టు ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు