రకుల్ కెరియర్ నాశనం కావడానికి ఆమెతో స్నేహమే కారణమా?

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కెరటం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్( Rakul Preeth Singh ) ఒకరు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.

అయితే అక్కడ కూడా ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదని తెలుస్తుంది.ఇలా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు ఉన్నఫలంగా సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె స్నేహమేనని తెలుస్తోంది.

రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్గా బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు అందుకున్నటువంటి తరుణంలో ఈమె పూర్తిగా ముంబైలోనే స్థిరపడ్డారు.అయితే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి రియా చక్రవర్తికి( Rhea Chakraborty ) మంచి స్నేహితురాలుగా మారిపోయారు.వీరిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండడంతోనే రకుల్ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని తెలుస్తుంది.

రియా చక్రవర్తి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ప్రియురాలు అనే విషయం మనకు తెలిసిందే.ఈ కేసు విషయంలో ఈమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు అయితే సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఈమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిసిపోయింది.

Advertisement

ఇలా సుశాంత్ కేసు నుంచి ఈమె బయట పడినప్పటికీ డ్రగ్స్ ( Drugs ) కేసులో కూడా ఈమె పేరు పెద్ద ఎత్తున మారుమోగి పోయింది.ఇలా డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి పేరుతో పాటు నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకు వచ్చింది.కేవలం ఆమెతో చేసిన స్నేహం( Friendship ) కారణంగానే డ్రగ్స్ కేసులో ఈమె కూడా చిక్కుకోవాల్సి వచ్చిందని అయితే డ్రగ్స్ కేసులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయి కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని తెలుస్తుంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు