Prabhas Anushka : ప్రభాస్ అనుష్క కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరస సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 This Is The Movie Prabhas Missed In Anushka Combo-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, కల్కి లాంటి సినిమాలని ఈ సంవత్సరం రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి…ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి( Baahubali ) లాంటి సినిమాలు వచ్చాయి.అయితే వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా కూడా రావాల్సింది.సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో( Saaho ) సినిమాలో కూడా మొదట అనుష్క ను హీరోయిన్ గా తీసుకున్నారు.కానీ బాహుబలి సినిమా కోసం ఓవర్ వెయిట్ పెరగడం వల్ల ఆమె ఈ సినిమాకి సెట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో ఆమెను పక్కనపెట్టి ఇంకొక హీరోయిన్ ను ఈ సినిమాలో తీసుకున్నారు.

ఇక అలా అనుష్క ప్రభాస్ కాంబినేషన్ లో రావాల్సిన నాల్గోవ సినిమా మిస్ అయిందనే చెప్పాలి.ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి పేరు అయితే ఉంది.ఇక వీళ్ళు కాంబోలో వచ్చిన బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు సక్సెస్ లను అందుకున్నాయి.ఆ ఉద్దేశ్యంతోనే సాహో లో కూడా తనని రిపీట్ చేయాలని చూశారు కానీ అనుకోని కారణాల వల్ల ఆమెను తీసేయాల్సి వచ్చింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube